గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్.. త్వరలోనే వైసీపీలోకి గంటా?

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. ఆయన వైసీపీలోకి త్వరలోనే జంప్ చేయనున్నట్టు సమాచారం. గతంలోనే ఆయనపై ఇలాంటి రూమర్లు వచ్చినప్పటికీ ఆయన అదేమీ లేదని తీసిపారేశారు. తాజాగా మరొకసారి గంటా పార్టీ మారడంపై చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తుండటంతో ఈ చర్చలకు బలం చేకూరినట్టైంది. దీనిని ఆయన ఖండిస్తూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఇప్పటికే వైసీపీలో చేరికపై గంటాకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.

సీఎం జగన్‌కు సన్నిహితులతో ఆయన ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపించినట్టు తెలుస్తోంది. అసలు వైసీపీలో చేరిక విషయమై అటు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి గానీ.. ఇటు మంత్రి అవంతి శ్రీనివాస్‌కి గానీ తెలియదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతకాలంగా విజయసాయిరెడ్డికి జగన్ తగిన ప్రాధాన్యమివ్వడం లేదంటూ చర్చ నడుస్తోంది. ఈ సమయంలో గంటా పార్టీలో చేరితే తనకు మరింత ప్రాధాన్యం తగ్గిపోతుందేమోనని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్టు వైసీపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. అన్ని అవాంతరాలనూ తొలగించుకుని త్వరలోనే గంటా వైసీపీలో చేరుతారని సమాచారం.

More News

హాట్ టాపిక్‌గా జనసేన ఎమ్మెల్యే రాపాక..

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన పార్టీ అధ్యక్షుడి కంటే వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌నే ఎక్కువ సార్లు ప్రశంసించి ఉంటారు.

నాకంత టైమ్ లేదు.. ‘పరాన్నజీవి’పై వర్మ..

తనపై బిగ్‌బాస్ ఫేం.. నూతన్ నాయుడు తెరకెక్కిస్తున్న ‘పరాన్నజీవి’ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

11 ఏళ్ల త‌ర్వాత అనుష్క సినిమా రీమేక్‌...!!

స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్‌ను స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతుంది. సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క దాదాపు అంద‌రు సూప‌ర్‌స్టార్స్‌తో న‌టించింది.

అది చిరంజీవి గారి డ్యూటీ కాదు..: ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యూస్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఆయన ఆలోచనా విధానం ఉంటుంది.

'Bకామ్ లో ఫిజిక్స్ ' ఫస్ట్ లుక్ విడుదల

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు.