జగన్ సర్కార్‌ కొత్త బిల్లు: రేప్ చేస్తే మరణ శిక్షే..

  • IndiaGlitz, [Wednesday,December 11 2019]

మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని హోం మంత్రి మొదలుకుని.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వరకూ పాదయాత్ర, అసెంబ్లీలో చెప్పారు. అయితే అన్నట్లుగానే జగన్ ఆ మాటను నిలబెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు కొండంత అండే చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం భేటీ అయిన ఏపీ కేబినెట్.. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు -2019కు ఆమోదం తెలిపింది. అత్యాచార కేసుల్లో వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలని, అత్యాచార కేసుల్లో 21 రోజుల్లోనే తీర్పు వెలుబడనుంది. అత్యాచార కేసులకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక కోర్టు పరిధిలో యాసిడ్‌ దాడులు, అత్యాచారం కేసులు, సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు ఉంటాయి.

ఈ చట్టం ప్రకారం:-

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష..

మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే.. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష

చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు

తీర్పులు ఇలా..!
ఇదిలా ఉంటే.. పక్కాగా ఆధారాలు ఉంటే అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేయనున్నారు. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. ఇప్పటి వరకూ ఇలాంటి కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకు ఓ కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. దిశ ఘటన నేపథ్యంలో.. మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో తెలిపిన సంగతి తెలిసిందే.

More News

'వీరశాస్త అయ్యప్ప కటాక్షం'కు ఇది తొలి విజయం!! 

100 క్రోర్స్ అకాడమీ, వరాంగి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకతంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త  వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రిష్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న

ఊల్లాల ఊల్లాల చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన - కేటీఆర్

నటరాజ్, నూరిన్, అంకిత హీరో-హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం "ఊల్లాల  ఊల్లాల". సీనియర్ నటుడు 'సత్య ప్రకాష్"

‘లోకేశ్‌ను చూస్తే వణకు.. బాలయ్యకు బాబు అన్యాయం’

వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఎలాంటి వారిపై అయినా విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే.

జనసేనానికి ఝలక్ ఇచ్చిన ఏకైక ఏమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ..

'అల వైకుంఠపురంలో' టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్.. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో