టాలీవుడ్‌కు జగన్ సర్కార్ బిగ్ రిలీఫ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు లాక్ డౌన్లు పూర్తవ్వగా.. 4.0 మే-18 నుంచి మే-31వరకు ఉండనుంది. ఈ క్రమంలో కొన్ని సడలింపులను కేంద్రం ఇవ్వగా.. మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలకే చాయిస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకటి అర తప్ప కేంద్రం చెప్పిన మార్గదర్శకాలను పాటిస్తూనే సడలింపులను యథావిధిగా పాటించేస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. సినిమా షూటింగ్స్, రిలీజ్, థియేటర్స్ బంద్ అయ్యి సుమారు రెండు నెలలు దాటిపోయింది. ఇంతవరకూ ఓపెనింగ్స్ లేవ్. అందరికంటే ముందుగానే.. ప్రభుత్వం కూడా ప్రకటించక మునుపే టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా షూటింగ్స్, రిలీజ్లు.. థియేటర్స్‌ను బంద్ చేసింది.
తియ్యటి శుభవార్త.. జీవో కూడా!
ఇప్పటికే తెలంగాణలో షూటింగ్స్ చేసుకోవడానికి గానీ.. సినిమా థియేటర్స్ ఓపెనింగ్స్‌కు కూడా అనుమతించే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పేశారు. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం టాలీవుడ్‌కు బిగ్ రిలీఫ్ ఇస్తూ తియ్యటి శుభవార్త చెప్పారు. ఏపీలో షూటింగ్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను కూడా రిలీజ్ చేసింది. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా షూటింగ్స్ చేసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో జగన్ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీకి కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. అయితే మొదట ఇందుకు సంబంధించి కొన్ని కేటగిరీలోకి వచ్చే షూటింగ్స్ రూ. 5వేలు.. మరికొన్ని కేటగిరీల్లోకి వచ్చే వాటికి 10 రూపాయిలు చెల్లించాలని.. షూటింగ్స్ పూర్తయ్యాక మొత్తం డబ్బులు రీఫండ్ చేస్తామని ఉత్వర్వుల్లో ప్రభుత్వం నిశితంగా వివరించింది.
ఉత్తర్వుల్లో ఏముంది..!?
- నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తున్నాం.
- విశాఖపట్నం, తిరుపతి, భీమునిపట్నం, టూరిజం, ఆర్&బీ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వచ్చే స్పాట్లను రూ.5వేల కేటగిరీలోకి వస్తాయి.
- దేవాదాయ శాఖ పరిధిలోని కట్టడాలు, హార్టీకల్చర్, అడవులు, పబ్లిక్ లైబ్రరీలు రూ.10వేల కేటగిరీలో ఉన్నాయి.
- అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మ్యూజియంలు, స్కూళ్లు, పబ్లిక్ పార్కులను రూ.15వేల విభాగంలోకి వస్తాయి.
- ఇందుకుగాను డిపాజిట్లు చెల్లిస్తే... షూటింగ్ ముగిసిన అనంతరం వాటిని రీఫండ్ చేస్తాం.
తెలంగాణ ఎప్పుడో..!
మొత్తానికి చూస్తే.. రెండు నెలలుగా వాయిదా పడి ఏం చేద్దాం.. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఆలోచనలో పడ్డ దర్శకనిర్మాతలకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. అంటే.. ఇక దర్శకనిర్మాతలు సినిమా షూటింగ్స్ షురూ చేసుకోవచ్చన్న మాట. మరి ఏపీలో ఎవరెవరు షూటింగ్స్ ప్రారంభిస్తారో చూడాలి. కాగా.. ఏపీ సర్కార్ రిలీఫ్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కూడా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే భారీ బడ్జెట్ సినిమాలు మొదలుకుని చిన్న బడ్జెట్ సినిమాలు పట్టాలెక్కేస్తాయ్.. అంతేకాదు కొత్త సినిమాలు షురూ అవుతాయ్. కేసీఆర్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఏంటో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout