Chandrababu Naidu:చంద్రబాబుకు జగన్ మార్క్ షాక్.. ఉండవల్లి గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసిన ఏపీ సర్కార్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జగన్ ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఉండవల్లిలోని కృష్ణానదిని ఆనుకుని కరకట్టపై చంద్రబాబు నివసిస్తున్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా దీనిని నిర్మించినందునే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. క్రిమినల్ లా అమెండమెంట్స్ 1944 చట్టం ప్రకారం తాము చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
లింగమనేనికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు : సీఐడీ
తెలుగుదేశం హయాంలో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమరావతిలో రాజధాని ప్రకటన, ఇన్‌సైడర్ ట్రేడింగ్, సీఆర్‌డీఏ ప్లాన్ ఆలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రభుత్వ వాదన. లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగానే ఆయన చంద్రబాబుకు ఉండవల్లి కరకట్టపై వున్న గెస్ట్‌హౌస్‌ను ఇచ్చారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అక్రమంగా పొందిన ఈ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలని సీఐడీ చేసిన సిఫారసుల ఆధారంగా ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే స్థానిక న్యాయమూర్తికి సమాచారం ఇచ్చి గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసినట్లు పేర్కొంది.
లింగమనేనిదే కాదు.. మరికొందరి ఆస్తులు కూడా : పేర్ని నాని
ఈ వ్యవహారంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందిన వారి ఆస్తులను అటాచ్ చేస్తామని స్పష్టం చేశారు. నిజాలను దాచలేరని, ఎప్పటికైనా వాస్తవాలు బయటపడతాయని పేర్ని నాని పేర్కొన్నారు. లింగమనేని రమేశ్‌కు అద్దె చెల్లించకుండా చంద్రబాబు ఫ్రీగా గెస్ట్‌హౌస్‌లో ఎందుకు వుంటున్నారని మాజీ మంత్రి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో లింగమనేని రమేశ్‌తో పాటు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో లబ్ధిపొందిన వారి ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు పేర్ని నాని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments