సింగిల్ సంతకంతో వైసీపీ సీనియర్లకు జగన్ శుభవార్త!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును.. మీరు వింటున్నది నిజమే అతి త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘సింగిల్ సంతకం’తో శుభవార్త చెప్పబోతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సీనియర్ నేతలు, ఎన్నికల్లో ఓడిన నేతలకు ఇది శుభవార్తేనని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకీ జగన్ చేసే ఆ సింగిల్ సంతకం ఏంటి..? ఇంతకీ సీనియర్లకు శుభవార్త ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి భేటీలోనే..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని.. కలలో కూడా కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ విజయ దుందుభి మోగించింది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. డిప్యూటీ సీఎంలు, మంత్రులు ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది నామినేటెడ్ పదవులు మాత్రమే. ఇప్పటి వరకూ నామినెటెడ్ పదవుల్లో కొనసాగిన టీడీపీ నేతలు కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేయగా.. మరికొందరు మాత్రం మొండికేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ఏపీలో అన్ని నామినేటెడ్ కమిటీలను రద్దు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కేబినెట్ తొలి భేటీలో ఈ విషయంపై మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
సింగిల్ సంతకంతోనే..!
కాగా.. టీడీపీ హయాంలో నియమించిన కమిటీలన్నీ ఒకే ఒక్క సంతకంతో రద్దు కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం నుంచి జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయమై బిల్లు తీసుకుకావడం లేదా ఆ తర్వాత ఆర్డినెన్స్ తేవడం ద్వారా వీటీకి మంగళం పాడాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ కమిటీలను, బోర్డు పాలక మండళ్లను ఒక్క సంతకంతో రద్దు చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం. దీంతో ఈ పదవులన్నింటినీ.. సీనియర్ నేతలు, పదవి రాకుండా భంగపడ్డ నేతలకు, ఎన్నికల్లో ఓడిన నేతలకు ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ప్రక్రియకు ఎన్నిరోజులు పడుతుందో..? ఎవరెవర్ని పదవులు వరించనున్నాయో తెలియాలంటే జగన్.. ఆ ‘సింగిల్ సంతకం’ పెట్టేవరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments