కొత్త మంత్రులకు ఊహించని శాఖలు కేటాయించిన సీఎం జగన్!
- IndiaGlitz, [Saturday,June 08 2019]
ఏపీ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మందిలో ఐదుగురికి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శాఖలు ఫిక్స్ చేసేశారు. శాఖల్లలో కీలకమైన హోంశాఖ, పంచాయతీ రాజ్‌శాఖ, ఆర్థికశాఖ, సమాచారశాఖ, రెవెన్యూశాఖలకు మంత్రులు దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఇక అధికారికంగా మాత్రమే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ శాఖలు ఊహించని వ్యక్తులను వరించడం గమనార్హం. ముందుకు ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారని అందరూ అనుకున్నారో ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఎవరై ఊహించని రీతిలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగిందని తెలుస్తోంది.
ఐదుగురికి ఫిక్స్ అయిన శాఖలివే...
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కి హోంశాఖ కేటాయించే అవకాశం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్‌శాఖ కేటాయించే అవకాశం
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆర్థికశాఖ కేటాయించే అవకాశం
కన్నబాబుకు సమాచారశాఖ కేటాయించే అవకాశం
బాలినేని శ్రీనివాసరెడ్డికి రెవెన్యూశాఖ కేటాయించే అవకాశం
కాగా.. వీరిలో హోం శాఖ.. పెద్దిరెడ్డికి ఇస్తారని అందరూ భావించారు.. అయితే ఆఖరి నిమిషంలో సీన్ రివర్స్ అయ్యింది. పెద్దిరెడ్డిని పంచాయితీ రాజ్‌శాఖ వరించింది. మరోవైపు పిల్లి సుభాష్‌కు అసలు ఆ శాఖ ఇస్తారని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో. ఎవరూ ఊహించని విధంగా పిల్లికి హోం శాఖ కేటాయింపు జరగడం గమనార్హం. కాగా ఈయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఈ శాఖ కేటాయించారని తెలుస్తోంది. ఇవన్నీ అటుంచితే బుగ్గనకు మాత్రం పక్కాగా ఆర్థిక శాఖ ఇస్తారని అభిమానులు, వైసీపీ నేతలు భావించగా ఫైనల్‌గా అదే ఆయనకు ఫిక్స్ అయ్యింది. ఇక కన్నబాబు విషయానికొస్తే.. జర్నలిస్ట్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ఈయనకు సమాచార శాఖ కేటాయింపులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. అయితే బాలినేనికి మైనింగ్ ఇస్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో రెవెన్యూ శాఖను ఇవ్వాలని జగన్ భావించారని తెలుస్తోంది. కాగా ఇవాళ సాయంత్రం కొత్తగా ప్రమాణం చేసినవారికి ఏయే శాఖలు దక్కుతాయన్నది తేలనుంది.
కాగా.. పై ఐదుగురితో పాటు..
కార్యక్రమం ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో మొట్టమొదట ధర్మాన కృష్ణ ప్రసాద్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, ఆళ్లనాని, శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్,
గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా, శంకరనారాయణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.