Uddanam: ఉద్దానం ప్రజలకు అండగా సీఎం జగన్.. దశాబ్దాల కల సాకారం..
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంను దశాబ్దాలుగా కిడ్నీల సమస్య వేధిస్తోంది. తరతరాలుగా కిడ్నీలు పాడై ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఆ జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాయకులే కరువయ్యారు. కేవలం ఎన్నికలప్పుడు నాయకులు రావడం.. సమస్య తీరుస్తామని హామీలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. దీంతో అక్కడి ప్రజలు కూడా తమ సమస్యకు పరిష్కారం ఇక దొరకదేమో.. మా బతుకులు ఇంతే అని జీవనం సాగిస్తున్నారు. కానీ ఇన్నాళ్లుకూ వారి ఎదురుచూపులకు తెరపడింది. నేనున్నానంటూ సీఎం జగన్ అభయ హస్తం అందించారు.
200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా ఉద్దానం ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఆస్పత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను చూసి చలించిపోయారు. అధికారంలోకి వస్తే, కిడ్నీ బాధితులకు రూ.10వేలు ఫించన్‌తో పాటు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పలాసలో రూ.50కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. దీనికి డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిగా నామకరణం చేశారు. అత్యాధునిక హంగులతో కూడిన ఆసుపత్రితో పాటు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి రానుంది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో సతమతం అవుతున్న ఉద్దానం ప్రజల కల నెరవేరతోంది.
రూ.700కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్ట్..
అంతేకాకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతో అసలు ఈ కిడ్నీల వ్యాధికి గల మూల కారణాలపై పరిశోధన చేసి అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అసలు రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్దం చేశారు. కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో సీఎం జగన్ ఇచ్చిన హమీ మేరకు ఆస్పత్రి నిర్మాణం చేయడమే కాకుండా సుమారు 700 కోట్ల రూపాయలతో స్వచ్ఛమైన నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుజలధార ప్రాజెక్టును చేపట్టారు.
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..
పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు. ఆసుపత్రితో పాటు సుజలధార ప్రాజెక్టులను ఈ నెల 14న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దీంతో ఇన్నేళ్ల తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. తమ బతుకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout