నాన్న సెంటిమెంట్‌ను ఫాలో అయిన జగన్!
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఎవరూ కలలో కూడా ఊహించని.. ఊహకందని రీతిలో అదే సినిమా డైలాగ్ మాదిరిగా తిప్పికొడితే... సరిగ్గా పదేళ్లకే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 2014లో జస్ట్ మిస్ట్ అయిన సీఎం పీఠాన్ని ఈసారి మాత్రం గట్టిగా అనుకొని అటు టీడీపీ సైకిల్‌కు గాలిదీసి.. ఇటు జనసేన గ్లాస్ పగులగొట్టిన వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ జగన్ పాలన మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ అన్నీ వైఎస్‌నే ఫాలో అవుతూ వస్తున్నారు.
ముఖ్యంగా.. ఎన్నికల సీజన్లో జగన్ స్పీచ్ మొదలుకుని ప్రమాణ స్వీకారం వరకు అన్నీ వైఎస్‌నే ఫాలో అవుతున్నారు. అందుకే రాజన్న రాజ్యం, వైఎస్ పాలన అంటూ వైసీపీ శ్రేణులు చెబుతుంటాయ్. అలా అచ్చుగుద్దినట్లుగా వైఎస్‌ను జగన్ దింపేస్తున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్‌కు చేతికి గడియారం పెట్టుకునే అలవాటు చాలా తక్కువ. అయితే ప్రమాణం రోజు మాత్రం చేతికి గడియారం పెట్టుకుని.. అది కూడా సేమ్ టూ సేమ్ వైఎస్ లాగానే ధరించి అభిమానులు, రాష్ట్రవ్యాప్తంగా ఉండే కార్యకర్తలు అందరూ ఆశ్చర్యపోయారు. అలా ప్రమాణం మొదలుకుని నేటి వరకూ అన్నీ వైఎస్ లాగే నిర్ణయాలు తీసుకుంటా పాలనలో దూసుకెళ్తున్నారు.
నాడు వైఎస్.. నేడు జగన్!
ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ తన కేబినెట్లో హోంశాఖ మంత్రిగా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) సబితా ఇంద్రారెడ్డి నియమించి హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మహిళకు హోం శాఖ కేటాయించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ? ఎందరో విమర్శించారు.. ఇంకెంతమందో హోం శాఖ నుంచి తొలగించాలని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ వైఎస్ మాత్రం వెనకడుగు వేయలేదు. అయితే సబితా సైతం ఈ శాఖను చాలెంజింగ్ తీసుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అలా మహిళగా హోం శాఖకు న్యాయం చేశారు. నాటి నుంచి చాలా వరకు పలు రాష్ట్రాల్లో, కేంద్రంలో హోం శాఖ మహిళలకు ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నారు.
ఇక వైఎస్ జగన్ విషయానికొస్తే...
వైఎస్ జగన్ కేబినెట్లోకి హోంశాఖను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణం చేసిన మేకతోటి సుచరితకు హోం శాఖను కట్టబెట్టారు. అయితే హోం శాఖ కచ్చితంగా వైసీపీలో సీనియర్ నేత, వైఎస్ హయాం నుంచి నేటి వరకూ ఆయన ఫ్యామిలీకి ఆప్తుడిగా పేరుగాంచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దక్కుతుందని అందరూ భావించారు. అయితే పెద్దిరెడ్డికి ఎవరూ ఊహించని విధంగా పంచాయితీ.. మేకతోటికి మాత్రం హోం దక్కింది. దీంతో నాటి వైఎస్‌ను అచ్చుగుద్దినట్లుగా వైఎస్ జగన్ దింపేస్తున్నారంటూ విశ్లేషకులు, రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే మేకతోటి సుచరిత హోంకు ఏ మాత్రం న్యాయం చేస్తారో..? ఈ శాఖను ఏ మాత్రం సమర్థవంతంగా నడుపుతారో వేచి చూడాల్సిందే మరి.
మొత్తానికి చూస్తే.. ఎన్నికల్లో గెలుపు మొదలుకుని ఇప్పటి వరకూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్.. ఇప్పుడు మరో సాహేసోపేత నిర్ణయం.. కీలక ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments