ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంచాలన్న ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. దీంతో ఈ రోజు పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మరో రెండేళ్ల పాటు వారు సర్వీస్ లో కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 52వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ... ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com