జగన్ ఢిల్లీ పర్యటనలో తీవ్ర అసహనం.. నిజమేనా!?

  • IndiaGlitz, [Tuesday,October 22 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో తీవ్ర అసహనంతో ఉన్నారా..? ఢిల్లీ వేదికగా వ్యవహారాలు చూసుకునే ఎంపీ విజయసాయిపై సీఎం పీకల్లోతు కోపంతో ఉన్నారా..? అమిత్ షా మొదలుకుని కేంద్ర మంత్రులతో భేటీల విషయంలో విజయసాయి సరిగ్గా ప్లాన్ చేయలేదని జగన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజనిపిస్తోంది.

ఏమీ మాట్లాడలేకపోయిన జగన్!
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక రోజంతా వేచి చూసినప్పటికీ జగన్‌కు షా అపాయిట్మెంట్ దొరకలేదని.. రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాల విషయంలో ఆయన ఢిల్లీకి రావడంతో కలవడానికి కుదరదని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ షాను కలిసినప్పటికీ ఆయన పుట్టిన రోజుకావడంతో విషెస్ చెప్పడం తప్ప ఏమీ మాట్లాడలేకపోవడం.. మాట్లాడటానికి సమయం లేకపోవడంతో జగన్ కాసింత అసంతృప్తికి లోనయ్యారని సమాచారం.

విజయసాయిపై అసహనం నిజమేనా!
విజయసాయికి ఎంపీ పదవి దక్కినప్పట్నుంచి జాతీయస్థాయిలో అన్ని వ్యవహారాలు తానే చూసుకునేవారు. మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఏపీకి సంబంధించిన వ్యవహారాలు, ప్రధాని, మంత్రులతో భేటీలు, అపాయిట్మెంట్స్‌లో ఇలా అన్ని విషయాలను విజయసాయే చూసుకుంటారు. అయితే తాజాగా విజయసాయి మాత్రం జగన్ ఆశించినంతగా ప్లాన్ చేయలేకపోయారని కనీసం షాతో కూడా జగన్ కొన్ని నిమిషాల పాటు కూడా భేటీ జరగకపోవడంతో.. ‘అసలేంటి అన్నా ఇది.. ఏం చేస్తున్నారు మీరిక్కిడ ఇదేనా భేటీ అంటే..?’ అని విజయసాయిపై ఆయన గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

కేంద్ర మంత్రుల అపాయిట్మెంట్స్ రద్దు..!
ఇదిలా ఉంటే అమిత్ షా.. జగన్‌కు మాట్లాడటానికి అనుకున్నంత సమయం ఇవ్వకపోవడంతో ఆయన తర్వాత భేటీ కావాల్సిన కేంద్ర మంత్రులంతా అపాయిట్మెంట్స్ రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఢిల్లీ వేదికగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే బీజేపీ అధిష్టానం జగన్ పట్ల ఎందుకిలా చేస్తోంది..? అసలు జగన్‌ను పక్కనపెట్టాలని ఎందుకు కమలనాథులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు..? ఇంతవరకూ జగన్‌తో బాగానే ఉన్న కేంద్రం.. ఇప్పుడెందుకిలా..? చేస్తోందని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశరాజధానిలోనూ చర్చనీయాంశమయ్యాయి.

అబ్బే అదేం లేదు.. అంతా ఒట్టిదే..!?
జగన్ ఢిల్లీ పర్యటనపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ వర్గాలు స్పందించాయి. అవన్నీ అవాస్తవాలేనని జగన్.. ఢిల్లీ పర్యటన సాఫీగానే సాగిందని చెబుతున్నారు. అంతేకాదు రాష్ట్ర విభజన సమస్యలు మొదలుకుని పీపీఏల వ్యవహారం, రివర్స్ టెండరింగ్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం ఇలా పలు విషయాలపై షాతో నిశితంగా 40 నిమిషాల పాటు కొనసాగిందని వైసీపీ వర్గాలు కుండ బద్ధలు కొడుతున్నాయి. అసలు విజయసాయిపై జగన్ అసహనం వ్యక్తం చేయడమేంటి..? ఇది పచ్చి అబద్ధమేనని తమ అధినేతకు అంత అవసరమేంటి..? ఇవాళ అపాయిట్మెంట్ రద్దయితే రేపొద్దున దొరుకుతుంది అంతేకానీ అంత మాత్రాన ఇష్టానుసారం వార్తలు రాసేస్తారా..? అంటూ వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కాగా.. ఢిల్లీ పర్యటనలో వైఎస్ జగన్ వెంట.. ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేష్, రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

మొత్తానికి చూస్తే.. జగన్ ఢిల్లీ పర్యటనపై వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలేనని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

More News

బోటు ఆపరేషన్ సక్సెస్.. అతికష్టమ్మీద వెలికితీత

తూర్పుగోదావరి గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును సుమారు నెలరోజుల తర్వాత ఎట్టకేలకు బయటికి తీశారు.

తమిళ చిత్రంపై మనసుపడ్డ రామ్ చరణ్

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ తమిళ చిత్రంపై మనసు పడ్డాడట. ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడని సినీ వర్గాల సమాచారం.

ఏషియన్‌ సంస్థపై ఐటీ దాడులు

సీనియర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ, నిర్మాత సునీల్‌ నారంగ్‌, నారాయణదాస్‌ నారంగ్‌లకు చెందిన ఏషియస్‌ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి.

ప్రభాస్ త్రిభాషా చిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో

కొన్‌కిస్కా గొట్టంగాళ్లు అంటూ నోరు పారేసుకున్న అలీ

తెలుగులో స్టార్ క‌మెడియ‌న్ అలీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈయ‌న రీసెంట్‌గా న‌టించిన చిత్రం `రాజుగారిగ‌ది 3`.