ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నెల్లూరుకి ఐసీఎంఆర్ టీమ్‌ను పంపాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనాకు విరుగుడుగా ప్రచారం జరుగుతున్న ఆనందయ్య మందుపై అధ్యయనానికి ఈ బృందం వెళ్లనుంది. సీఎం వద్ద ఆనందయ్య మందులపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. అనంతరం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ మందుపై ప్రచారం నిర్వహించింది. దీంతో పెద్ద ఎత్తున జనం ఈ మందు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నేడు ఈ మందు పంపిణీ చేయాలా.. వద్దా? అన్న అంశంపై జగన్ ఉన్నతాధికారులతో చర్చించారు.

ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్‌ కన్నా ప్రమాదకరం.. వైట్ ఫంగస్ లక్షణాలివే..

ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. ఆయుర్వేదం మందు పంపిణీ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఆయుర్వేదం మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై సీఎం చర్చించారు. ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై సైతం సీఎం చర్చించారు. అనంతరం ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశానంతరం మంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ.. ఐసీఎంఆర్ బృందాన్ని నెల్లూరు పంపాలని సీఎం ఆదేశించారన్నారు. ఈరోజు సాయంత్రానికి టీం వెళ్లే అవకాశం ఉందన్నారు.

కాగా.. ఈ మందు కోసం వేల సంఖ్యలో జనం కృష్ణపట్నానికి తరలివచ్చారు. దీంతో అధికారులు ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. మందు కోసం జనం పోటెత్తడంతో పంపిణీ చాలా కష్టంగా మారింది. 5 వేల మందికి సరిపడా మందు తయారు చేస్తే 35 వేల మంది పంపిణీ ప్రాంగంణం వద్దకు చేరుకున్నారు. భౌతిక దూరం లేకుండా క్యూ లైన్‌లు కడుతుండటంతో మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తునట్టు నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ పంపిణీ తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే రేపటి నుంచి విశాలమైన గ్రౌండ్‌లో మందు పంపిణీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి కోరారు.

More News

కోవిడ్ ఎఫెక్ట్ : రూల్స్ అతిక్రమిస్తే అంతే.. బిగ్ బాస్ సెట్ సీల్!

కరోనా విలయతాండవానికి ముగింపు ఎప్పుడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనితో అవసరమైన చోట్ల ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నాయి.

బద్రి హీరోయిన్ బోల్డ్ షో.. బిగుతు అందాలు చూస్తే ఉక్కిరిబిక్కిరే..

సోషల్ మీడియాలో తన బోల్డ్ షోతో రచ్చ చేస్తోంది అమీషా పటేల్. సినీ అభిమానులకు అమీషా పటేల్ గురించి పరిచయం అవసరం లేదు.

బ్లాక్ ఫంగస్‌ కన్నా ప్రమాదకరం.. వైట్ ఫంగస్ లక్షణాలివే..

కరోనా మహమ్మారి వ్యాప్తిని ఎలా అరికట్టాలా.. అని తలలు పట్టుకుంటున్న ప్రభుత్వానికి కొత్తగా రకరకాల వ్యాధులు తోడవుతూ సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తుంటే..

కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. మందు కోసం జనం పోటెత్తడంతో పంపిణీ చాలా కష్టంగా మారింది.

తన విలన్ కి మెగాస్టార్ రూ.2 లక్షల సాయం.. ఎమోషనల్ అయిన నటుడు

ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం మెగాస్టార్ చిరంజీవికి అనుదిన కార్యక్రమంగా మారిపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక సాయం చేస్తూ చిరంజీవి వార్తల్లో నిలుస్తున్నారు.