YS Jagan: చంద్రబాబుకు అండగా బినామీ స్టార్ క్యాంపెయినర్లు.. సీఎం జగన్ విమర్శలు..

  • IndiaGlitz, [Tuesday,January 23 2024]

టీడీపీ అధినేత చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు ఇతర పార్టీల నేతలు పనిచేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నిధులు విడుదల చేశారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో చంద్రబాబు భూములకు బినామీలు ఉన్నట్టే.. ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు.. బీజేపీలో ఉన్న వదినమ్మ(పురందేశ్వరి), రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా చేరిన కొందరు(షర్మిల), మీడియా ఆధిపతులు.. వీరంతా కలిసి చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.

జనం గుండెల్లో గుడి కట్టడమే..

మోసం చేయడమే వచ్చిన చంద్రబాబుకు ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తనకు ఇలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరని.. 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. మీకు మంచి జరిగితే తనకు మద్దతుగా నిలవండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. జనమే తన స్టార్ క్యాంపెయినర్లు అని.. కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని స్పష్టంచేశారు. ఎంతమంది కలిసి ఎన్ని కుట్రలు పన్నినా తాను నమ్ముకున్న దేవుడు, ప్రజలే తనకు అండగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

మహిళా సాధికారతకు పెద్ద పీట..

పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారని విమర్శించారు. అక్టోబర్‌ 2016 నుంచి అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 79 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఏపీలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

దోచుకో.. పంచుకో.. తినుకో..

చంద్రబాబు హయాంలో కూడా ఇదే రాష్ట్రం. ఇదే బడ్జెట్‌.. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రే. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని.. మహిళలు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని వివరించారు. గతంలో దోచుకో.. పంచుకో.. తినుకో.. మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు మీ బిడ్డ బటన్‌ నొక్కుతూ నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తు్న్నాడని జగన్ వివరించారు.

More News

Prashanth Kishore: టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబును అందుకే కలిశానని క్లారిటీ..

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor)గురించి ఏపీ ప్రజలకు బాగా సుపరిచితం. ఐప్యాక్ సంస్థ నేతృత్వంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పనిచేశారు. ఆయన వ్యూహాలతో ఆ పార్టీ భారీ మెజార్టీతో

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు ప్రమాదం.. 'దేవర' సినిమా విడుదలపై ఎఫెక్ట్..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'దేవర' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

వైసీపీకి మరో బిగ్ షాక్.. నరసరావుపేట ఎంపీ రాజీనామా..

ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు(Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు.

అభివృద్ధి కనిపించడం లేదా..? షర్మిల వ్యాఖ్యలపై సజ్జల విమర్శలు..

అప్పుడే మీసాలు వచ్చిన కుర్రాడు నా అంత పోటుగాడు లేడని ఊహించుకుంటూ ఉంటాడు.. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల.. అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ

బాల రాముడు ప్రాణప్రతిష్ట సమయంలో కన్నీళ్లు వచ్చాయి: పవన్

కోట్ల మంది భారతీయులు 500 ఏళ్లు నుంచి ఎదురుచూసిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యా్హ్నం అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి