YS Jagan: చంద్రబాబుకు అండగా బినామీ స్టార్ క్యాంపెయినర్లు.. సీఎం జగన్ విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు ఇతర పార్టీల నేతలు పనిచేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నిధులు విడుదల చేశారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో చంద్రబాబు భూములకు బినామీలు ఉన్నట్టే.. ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు.. బీజేపీలో ఉన్న వదినమ్మ(పురందేశ్వరి), రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా చేరిన కొందరు(షర్మిల), మీడియా ఆధిపతులు.. వీరంతా కలిసి చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జనం గుండెల్లో గుడి కట్టడమే..
మోసం చేయడమే వచ్చిన చంద్రబాబుకు ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తనకు ఇలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరని.. 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. మీకు మంచి జరిగితే తనకు మద్దతుగా నిలవండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. జనమే తన స్టార్ క్యాంపెయినర్లు అని.. కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని స్పష్టంచేశారు. ఎంతమంది కలిసి ఎన్ని కుట్రలు పన్నినా తాను నమ్ముకున్న దేవుడు, ప్రజలే తనకు అండగా ఉన్నారని ఆయన వెల్లడించారు.
మహిళా సాధికారతకు పెద్ద పీట..
పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారని విమర్శించారు. అక్టోబర్ 2016 నుంచి అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 79 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఏపీలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.
దోచుకో.. పంచుకో.. తినుకో..
చంద్రబాబు హయాంలో కూడా ఇదే రాష్ట్రం. ఇదే బడ్జెట్.. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రే. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని.. మహిళలు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని వివరించారు. గతంలో దోచుకో.. పంచుకో.. తినుకో.. మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కుతూ నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తు్న్నాడని జగన్ వివరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout