స్వామి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణ!

  • IndiaGlitz, [Monday,June 03 2019]

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మే-30న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. జూన్-07న కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకోవాలి..? ఏ జిల్లా నుంచి ఎంతమందిని తీసుకోవాలి..? అనేదానిపై నిశితంగా చర్చించి.. ఆ మరుసటి రోజే మొత్తం ఒకేసారి 25 మంది చేత ప్రమాణ స్వీకారం చేయించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే అంతకముందు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని జగన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం గురించి చర్చించనున్నారు. ఆయన ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ అప్పుడు జగన్ కేబినెట్ విస్తరణ చేస్తారని తెలుస్తోంది.

స్వామివారు ముహూర్తం ఫిక్స్ చేస్తారా!

రేపు అనగా.. మంగళవారం మఠంలో స్వామి సలహాలు, సూచనలు జగన్ తీసుకోనున్నారు. ఆయన విశాఖ పర్యటన మంగళవారం ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

రేపు విశాఖ చేరుకునే ఆయన, స్వరూపానందను దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోనున్నారు. ఆపై.. ప్రత్యేకంగా స్వామివారితో సుమారు అరగంటకు చర్చిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భేటీ అనంతరం వైఎస్ జగన్ తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. కాగా.. ఇప్పటికే వైఎస్ జగన్.. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత వైఎస్ జగన్, స్వరూపానందను దర్శించుకోలేదు. దీంతో రేపు స్వామివారిని జగన్ దర్శించుకోబోతున్నారు. కాగా.. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానందే పెట్టారన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకుని విశాఖ వెళ్లనున్నారు.

అయితే మంత్రి వర్గ విస్తరణపై జూన్-08నే స్వామి కూడా ఫిక్స్ చేస్తారా..? లేకుంటే.. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా..? అసలు స్వామి వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? ఇవ్వరా..? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉంటే జగన్ ముహూర్తాలు అని గుడ్డిగా వెళ్తుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More News

నేను భయపడట్లే.. నిరూపిస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటా..!

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన  విశ్వ‌క్ సేన్.. ఇటీవల హైదరాబాదీ నేటివిటీతో ‘ఫలక్‌నుమా దాస్’లో

హైదరాబాద్‌లోని ఏపీ భవనాలన్నీ తెలంగాణ సర్కార్‌కే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం రాజధాని చాలా వరకు పంపకాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు..

మురళీమోహన్‌‌ను పరామర్శించిన వెంకయ్య, చంద్రబాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌ వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన తన స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు

'సూప‌ర్ 30' రిలీజ్ డేట్ .. ఈద్ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌

బాలీవుడ్ స్టార్ హృతిక్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న బ‌యోపిక్ `సూప‌ర్ 30`.

జెడి చ‌క్ర‌వ‌ర్తితో వ‌ర్మ‌ సినిమా

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు చాలా మంది శిష్యులు, ఏక‌ల‌వ్య శిష్యులున్న సంగ‌తి తెలిసిందే.