జగన్ ఏరికోరి తెచ్చుకున్న ఏపీ అడ్వొకేట్ జనరల్‌ ఇతనే!

  • IndiaGlitz, [Tuesday,June 04 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న కొన్ని కొన్ని కీలక నిర్ణయాలతో ఇదివరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ సైతం కంగుతింటోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మంత్రుల ప్రమాణం స్వీకారం లాంటివి ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్నాయి. అయితే అందుకు పూర్తిగా విరుద్దంగా ఐఏఎస్, ఐపీఎస్‌లతో వరుస భేటీలు.. నియామాకాలు, బదిలీలు చూడం విశేషం. దీంతో యావత్ ప్రపంచం దృష్టిని జగన్‌ తనవైపుకు తిప్పుకున్నారు.

కొత్త అడ్వకేట్ జనరల్!
ఇదిలా ఉంటే.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ.. ప్రమోషన్‌లు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా.. రాష్ట్రానికి కొత్త అడ్వొకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ను నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మంగళవారం సాయంత్రం ఉత్వర్వులు జారీ చేశారు.

శ్రీరామ్ ట్రామ్ రికార్డ్ ఇదీ..!
శ్రీరామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వానికి చెందిన అనేక కేసులను ఆయన సమర్థంగా వాదించినట్లు పేరుంది. ఆయనకు సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉండటం.. ఎలాంటి అవినీతి మచ్చలు లేకపోవడంతో సుబ్రమణ్యమే కావాలని జగన్ ఏరికోరి అడ్వొకేట్ జనరల్‌గా తీసుకువచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

న్యాయ విచారణ జరపండి!
ఇదిలా ఉంటే.. వైజాగ్ పర్యటన ముగించుకుని విజయవాడ తిరిగొచ్చిన వైఎస్ జగన్.. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో.. గత ఐదేళ్లలో కేటాయించిన కాంట్రాక్టులు, భూ కేటాయింపులపై.. న్యాయవిచారణ జరపాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా న్యాయ వివాదాలకు తావివ్వకుండా.. సిట్టింగ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌ను జగన్ కోరినట్లు సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ఏపీ సీజేను కలవడం ఇదే ప్రథమం. కాగా, పలు ప్రాజక్టుల కాంట్రాక్టుల విషయంలో పారదర్శకత కోసం జ్యుడిషియల్ కమిషన్ వేయాలని సీఎం జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే.


 

More News

'సెవెన్' బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌నే కాన్ఫిడెన్స్ ఉంది - హీరో హవీష్

హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'.

కిల్లర్ తెలుగువారికి కచ్చితంగా నచ్చె చిత్రం - విజయ్ ఆంథోని

విజయ్ ఆంటొని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌.

డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా శివరంజని సినిమాలో స్పెషల్ సాంగ్ 'పాప్ కార్న్' విడుదల

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు.

పండ‌గ టైటిల్‌తో తేజ్‌

ఆరు వ‌రుస ప్లాపుల త‌ర్వాత సాయితేజ్ ఈ ఏడాది `చిత్రల‌హ‌రి`తో డీసెంట్‌ హిట్ కొట్టాడు సాయితేజ్‌. నెక్ట్స్ సినిమా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడట‌.

తదుప‌రి ప్లానింగ్‌లో అఖిల్‌

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అక్కినేని అఖిల్. సరైన బ్రేక్ కోసం అఖిల్ వెయిట్ చేస్తున్నాడు