close
Choose your channels

YS Jagan Birthday: వరల్డ్ టాప్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్

Thursday, December 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

YS Jagan Birthday: వరల్డ్ టాప్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజును పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. వారం రోజుల ముందే అభిమానులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు చేయడం మొదలుపెట్టారు. పల్లెటూరు, పట్టణం అనే తేడా లేకుండా ఊరురా బర్త్‌డే విషెస్ ఫ్లెక్సీలు కట్టారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానం, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ప్రధాని మోదీతో సహా ప్రముఖుల శుభాకాంక్షలు..

మరోవైపు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి హృదయపూర్వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇలా అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేతలతో పాటు విపక్ష నేతలు కూడా జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. అలాగే వైసీపీ శ్రేణులు తమ అధినేతకు బర్త్‌డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తున్నారు.

YS Jagan Birthday: వరల్డ్ టాప్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్

ఐదో స్థానంలో #HBDYSJagan హ్యాష్‌ట్యాగ్..

దీంతో ట్విట్టర్‌లో #HBDYSJagan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఎంతలా అంటే ప్రపంచంలోనే ఈ హ్యాష్‌ట్యాగ్ ఐదో స్థానంలో ఉంది. అలాగే ఆసియా దేశాల్లోనూ జగన్ హ్యాష్ ట్యాగ్ ఐదో స్థానంలో ఉండటం విశేషం. గతంలో ఏ నాయకుడి పుట్టినరోజుకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్ ఈ విధంగా టాప్ ట్రెండింగ్‌లో లేదు. ఇప్పుడు కేవలం జగన్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది. దీనిని బట్టి చూస్తుంటే ప్రజల్లో జగన్ నాయకత్వం పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. అతి పెద్ద పండుగ రోజైన తమ బాస్ పుట్టినరోజును పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ తమ ప్రేమను అభిమానులు ఇలా చాటుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment
Related Videos