జగన్‌పై హత్యాయత్నం కేసు: తీవ్ర విషమంగా నిందితుడి ఆరోగ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ అనే యువకుడు కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో జైల్లో నుంచి హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. ఇదిలా ఉంటే.. రాజమండ్రిలో వీలుకాకపోతే మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా.. గతంలో కూడా తన ఛాతి నొప్పి వస్తోందని.. తాను బతికలేనని.. ప్రజలతో మాట్లాడాలని ఉందని మొత్తుకున్నా పోలీసులు మాత్రం మీడియా ముందుకు రానివ్వలేదు. అయితే ఉన్నట్టుండి మంగళవారం సాయంత్రం శ్రీనివాస్ అనారోగ్యానికి గురవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజాలు బయటికి రాకుండా చేసేందుకు టీడీపీ డ్రామాలు ఆడుతోందని.. అన్యాయంగా ఓ అమాయకుడు దుష్ట రాజకీయ శక్తుల మధ్యన బలవుతున్నాడని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout