తోట ఫ్యామిలీకి కీలక పదవి.. హామీ ఇచ్చిన జగన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి.. తోట ఫ్యామిలీ నుంచి ఒకరు వైసీపీ నుంచి.. మరొకరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారుగా..? ఇక కీలక పదవులు వీరికి ఎలా వస్తాయ్..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. ఓడిపోయినప్పటికీ తోట గోదావరి జిల్లాల్లో మంచి పేరున్న తోట ఫ్యామిలీలో ఒకరికి కీలక పదవి ఇచ్చి గౌరవించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. ఇంతకీ తోట ఫ్యామిలీ నుంచి ఎవరికి పదవి ఇస్తున్నారు..? ఆ పదవి ఏంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
తోట ఫ్యామిలీకి చెక్ పడింది!
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసిన తోట నర్సింహం తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే అన్నట్లుగానే పెద్దాపురం టికెట్‌ను నర్సింహం భార్య తోట వాణికి ఇచ్చారు. టికెట్ అయితే దక్కించుకున్నారు గానీ గెలుపును మాత్రం తోట ఫ్యామిలీ జగన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వలేకపోయారు. కేవలం నాలుగు వేలకు పైచిలుకు ఓట్లతో వాణిపై చినరాజప్ప గెలుపొందారు. మరోవైపు రామచంద్రాపురం నుంచి పోటీచేసిన తోట త్రిమూర్తులు సైతం టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. దీంతో గోదావరి జిల్లాల్లో తోట ఫ్యామిలీకి చెక్ పడినట్లైంది.
ఓడినప్పటికీ కీలక పదవి!
అయితే ఓడినప్పటికీ తోట వాణి లేదా తోట నర్సింహం వీరిద్దరిలో ఎవరో ఒకరికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం. తోట సామాజిక వర్గం కాపు అన్న విషయం విదితమే. తన గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన కాపులకు జగన్ న్యాయం చేస్తానని ఇదివరకే హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా తోట వాణిని నియమించాలని జగన్ భావిస్తున్నారట. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన వారు చాలా తక్కువగానే ఉన్నారు. దీంతో తోట వాణికి మార్గం సుగుమైందని తెలుస్తోంది. అయితే మంత్రి వర్గ విస్తరణ జరిగిన వారం రోజులలోపే నామినేటెడ్ పదవుల భర్తీ జరగుతుందని సమాచారం. ఆఖరి నిమిషం వరకూ వాణీనే ఉంటారు.. లేకుంటే మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటాయా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout