విజయ్‌చందర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత తెలిదేవర విజయ్ చందర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా విజయ్ చందర్‌ను నియమిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వెలువడిన వెంటనే మార్పు జరగాలని జగన్ ఆదేశించారు. కాగా.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ కార్పొరేషన్‌కు అంబికా కృష్ణ చైర్మన్‌గా ఉన్న విషయం విదితమే. ప్రభుత్వం మారిన తర్వాత అంబికా రాజీనామా చేయగా.. ఆ స్థానంలో ఎవర్ని కూర్చోబెట్టాలా అని ఆలోచించిన వైఎస్ జగన్ ఆఖరికి విజయ్‌చందర్‌ను నియమించింది.
కాగా.. వైసీపీ స్థాపించిన నాటి నుంచి విజయ్ చందర్ పార్టీతోనే ఉన్నారు. ఒక్క మాటలలో చెప్పాలంటే బహుశా ఇండస్ట్రీ నుంచి వైసీపీ వైపు అడుగులేసిన ఏకైక పెద్ద మనిషి ఈయనేనని చెప్పుకోవచ్చు. వైసీపీ చేపట్టో ప్రతి కార్యక్రమంలోనూ ఈయన పాలుపంచుకునేవారు. వైఎస్ జగన్ పాదయాత్రలోనూ విజయ్ కీలక పాత్ర పోషించారు. అలా పార్టీకి, వైఎస్ జగన్‌కు మంచి విధేయుడిగా ఉండటంతో వైసీపీ కీలక పదవిని కట్టబెట్టింది. ఇదిలా ఉంటే సినిమాల పరంగా కరుణామయుడు చిత్రంలో క్రీస్తుగా, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యంలో సాయిబాబాగా నటించి తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో విజయ్ చందర్ చెరగని ముద్రవేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. విజయ్ చందర్ ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుకు మనవడు కావడం గమనార్హం.
చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్ పదవి కోసం వైసీపీలో చేరిన సీని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పోటీపడ్డారు. అంబికా రాజీనామా చేసిన నాటి నుంచే ఆ పదవి తనకంటే తనకు కావాలని ముఖ్యమంత్రి జగన్ దగ్గర చాలా మందే నేతలు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారట. వీరిలో సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, మంచు మోహన్‌బాబు, సీనియర్ కమెడియన్ అలీ, పోసాని మురళీకృష్ణతో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments