Deepika:హిందూపురంలో బాలయ్యపై మహిళా అస్త్రం .. జగన్ వ్యూహం, ఇన్‌ఛార్జ్‌గా టీఎన్ దీపిక..?
Send us your feedback to audioarticles@vaarta.com
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ స్థానానికి ఉమ్మడి ఏపీలో కానీ, నవ్యాంధ్రలో కానీ ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ కోటను బద్ధలు కొట్టాలని హేమాహేమీల్లాంటి నేతలు ఎన్నో వ్యూహాలు రచించినా, బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించినా సాధ్యం కాలేదు. 1983 నుంచి నేటి వరకు టీడీపీయే ఇక్కడ విజయం సాధించింది. రాష్ట్రంలో ఎక్కడైనా టీడీపీ ఓడిపోవచ్చు గానీ.. హిందూపురంలో మాత్రం పసుపు జెండా ఎగరాల్సిందే. అంతేందుకు హిందూపురంలో టీడీపీ గడ్డిపరకను నిలబెట్టినా గెలుస్తుందన్న నానుడి ప్రజల్లో వుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎన్టీఆర్ తనయుడు, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వరుసగా రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మూడోసారి కూడా గెలిచి బాలయ్య హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు.
టికెట్ దాదాపుగా దీపికకే :
అయితే టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టాలని, బాలయ్య జోరుకు అడ్డుకట్ట వేయాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిశ్చయించుకున్నారు. ఎన్నో సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు ప్రాతిపాదికగా ఇక్కడ బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని జగన్ పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా బాలయ్యను ఢీకొట్టేందుకు మహిళా అభ్యర్ధిని జగన్ బరిలోకి దించుతున్నారు. సీనియర్ నేత టీఎన్ దీపికను హిందూపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో హిందూపురం టికెట్.. ఆమెకి కేటాయించడం దాదాపు ఖాయమైనట్లే.
పెద్దిరెడ్డి సూచనతో జగన్ నిర్ణయం :
ఇటీవల తాడేపల్లిలో జరిగిన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్ఛార్జీల సమీక్షా సమావేశానికి ఇక్బాల్‌కు బదులుగా దీపిక హాజరయ్యారు. అప్పుడే ఆమె అభ్యర్ధిత్వంపై మీడియాలో కథనాలు వచ్చాయి. చివరికి అంతా ఊహించినట్లుగానే దీపికను హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు జగన్. అయితే సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచన, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకున్న తర్వాతే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వైసీపీలో చర్చ జరుగుతోంది. హిందూపురం చరిత్రలో ఇంత వరకు ఏ పార్టీ కూడా మహిళను బరిలోకి దించలేదు. ఈ క్రమంలోనే తొలిసారి జగన్ ప్రయోగం చేయనున్నారు. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా..? లేక మరోసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అన్నది వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout