జగన్, కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు నో పర్మిషన్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. గురువారం మధ్యాహ్నం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాఫణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణం అనంతరం సుమారు అరగంటకు పైగా ప్రసంగం ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన అతిరథుల ప్రసంగం ఇలా వేదికపైనే 2:15 గంటలు సమయం అయ్యింది. అనంతరం మళ్లీ జగన్ స్వగృహానికి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ వెళ్లడం ఇలా సుమారు మరో అరగంట పైగా సమయం పూర్తయ్యింది.
అయితే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 3 గంటల తర్వాత ప్రత్యేక విమానాల లాండింగ్‌కి అనుమతి లేని కారణంగా పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కాగా.. షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్‌కు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అనుమతులు మధ్యాహ్నం మూడు గంటలకు ముందే రద్దు చేసింది. దీంతో ఇద్దరు వైఎస్ జగన్, కేసీఆర్ ఇద్దరూ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు వెళ్లాల్సి ఉంది. విమానాల లాండింగ్‌కు అనుమతి లేకపోవడంతో వెళ్లలేకపోయిన ఈ ఇద్దరు పీఎంవో కార్యాలయానికి కాల్ చేసి మోదీకి విషెస్ చెప్పారు. మరోవైపు కాబోయే మంత్రులందరికీ కేసీఆర్, జగన్ అభినందనలు తెలిపారు. కాగా ఇవాళ సాయంత్రం 7గంటలకు సరిగ్గా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout