వైఎస్ జగన్, చంద్రబాబు.. ఇద్దరి టార్గెట్ చెవిరెడ్డే!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చెవిరెడ్డి అంటే ఓకే కానీ.. జగన్ టార్గెట్ ఏంటి..? అని కన్ఫ్యూజ్ అవుతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే ఇద్దరి టార్గెట్ చెవిరెడ్డే.. అయితే చెవిరెడ్డిని ఓడించాలని చంద్రబాబు.. గెలిపించుకోవాలని వైఎస్ జగన్.. ఇలా ఇద్దరూ ఎవరికి వారు టార్గెట్ పెట్టుకున్నారు.. అసలు ఈ టార్గెట్ వ్యవహారమేంటి..? అసలు చంద్రగిరిలో ఏం జరుగుతోందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
బాబు టార్గెట్ ఇదీ..!
వైసీపీ కీలకనేతలు, తనకు వ్యతిరేకంగా మాట్లాడి అసెంబ్లీలో హడావుడి చేసిన వారిని చాలా మందిని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకుని ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారట. అందులో చెవిరెడ్డి ముందు వరుసలో మొదటి వ్యక్తట. అందుకే చెవిరెడ్డిని ఎలాగైనా సరే ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయాలని భావించిన చంద్రబాబు.. చేయని ప్రయత్నాలు లేవట. ఇందుకు కారణం అసెంబ్లీలో ఒకట్రెండు సార్లు బాబును ఇబ్బందిపెట్టడం.. చిత్తూరు జిల్లా కీలకనేతల్లో చెవిరెడ్డి ఒకరు కావడమేనట. ఎన్నికల సీజన్ మొదలుకుని రీ-పోలింగ్ వ్యవహారం వరకూ అన్నీ పర్సనల్‌గా తీసుకున్న చంద్రబాబు ఇటీవల ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దాకా ఈ పంచాయితీ తీసుకెళ్లడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా.. ఇక్కడ్నుంచే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తో ప్రారంభించి మొదటసారే చంద్రగిరి నుంచి గెలిచి నిలిచారు కూడా!
ఇక జగన్ టార్గెట్ విషయానికొస్తే..
వైసీపీ పార్టీ పెట్టినప్పట్నుంచి నేటి వరకూ వైఎస్ జగన్‌కు అండగా.. తోడుగా నీడగా ఉన్నవారిలో కీలకనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి కాగా ఆ తర్వాత స్థానంలో ఉండే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డేనని పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. అలా చెవిరెడ్డి-జగన్ మధ్య మంచి స్నేహబంధాలున్నాయి. అంతేకాదు.. వైఎస్ జగన్‌ను ప్రత్యర్థులు పొల్లెత్తి మాటన్నా చాలు అస్సలు ఊరుకునే వ్యక్తి కాదు.. మరుసటి క్షణమే ప్రెస్‌మీట్ పెట్టి ప్రత్యర్థుల వ్యాఖ్యలకు కౌంటర్లివ్వడం ఇలా చేస్తూ వస్తున్నారు. ఇలా వైసీపీలో కీలకనేతగా ఎదిగి.. జగన్‌తో స్నేహబంధం ఏర్పరుచుకున్నారు. అందుకే వైఎస్ జగన్ ఈ రీపోలింగ్.. చెవిరెడ్డి గెలిపించుకోవాలనే టార్గెట్‌గా పెట్టుకుని చంద్రబాబు వ్యూహాలను.. ఎత్తులను చిత్తు చేస్తూ ప్లాన్ చేశారట. అయితే అంతా అయిపోయింది.. ఇక ఫలితాలే తరువాయి.. వైసీపీ గెలవగానే చెవిరెడ్డిని తన కేబినెట్లోకి తీసుకోవాలని జగన్ అనుకుంటున్న టైమ్‌లో రీ పోలింగ్ వచ్చి పడింది. అయితే ఈ ఐదు బూత్‌లు కూడా టీడీపీ బూత్‌లు కావడంతో ఎలాగైనా సరే రీపోలింగ్ జరిపించి ఆ ఓట్లన్నీ వైసీపీకే పడేలా చూడాలని జగన్ ఓ టీమ్‌ను తయారు చేసి చంద్రగిరికి పంపారట.
ఇలా గల్లీ వ్యవహారాన్ని ఢిల్లీ దాకా చేర్చడంతో చంద్రగిరి పేరు జాతీయ మీడియాలో సైతం మార్మోగుతోంది. సో.. జగన్ టార్గెట్‌ను రీచ్ అవుతారా..? చంద్రబాబు టార్గెట్ సక్సెస్ అవుతుందా..? అనేది తేలిపోవాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout