వైయస్ అంటే ఓ బ్రాండ్.. ఎవరు పడితే వారు వాడుకోవడం కుదరదు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొద్ది మంది నేతలు మాత్రమే తమదైన ముద్ర వేశారు. స్వర్గస్థులైనా ఇప్పటికీ వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. వారు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. వైఎస్సార్‌గా పేదల ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎందరో లబ్ధిపొందారు. అందుకే ఆయనను దేవుడిగా కొలుస్తారు. రాజకీయాల్లో వైయస్ అంటే ఓ ఇంటి పేరు మాత్రమే కాదు.. ఇచ్చిన మాట మేరకు ఎంతటి వారితోనైనా రాజీపడకుండా ఎంత దూరమైనా వెళ్లే ఓ బ్రాండ్.
తండ్రిని మించిన తనయుడిగా ఖ్యాతి..
వైయస్ వచ్చాకే రాజకీయాలకు ఓ విలువ గౌరవం పెరిగిందని విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. అప్పటివరకు రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు, నమ్మించి మోసం చేయడం వంటివి ఉండేవి. కానీ వైయస్ రాకతో విశ్వసనీయతకు చోటు దక్కింది. ఆయన మరణించినా సరే ఆ అడుగుజాడల్లో కుమారుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారని అందరూ చెబుతుంటారు. తండ్రిని మించిన తనయుడిగా ఖ్యాతి పొందారని.. ఇచ్చిన మాట చేసిన వాగ్దానం అమలు చేసే విషయంలో వైయస్ఆర్ రెండు అడుగులు ముందుకు వేస్తే వైయస్ జగన్ నాలుగు అడుగులు ముందున్నారని కొనియాడుతున్నారు.
స్వలాభం కోసం వాడుకోవడం దురదృష్టం..
ప్రజలని పాలించడం కాదు లాలించడం ముఖ్యమంత్రి బాధ్యత అని సరికొత్త నిర్వచనం ఇచ్చారంటున్నారు. రైతులు, మహిళలను ఆదరించే విషయంలో తండ్రిని దాటి ఆ వర్గాల పాలిట దేవుడయ్యారని వెల్లడిస్తున్నారు. తండ్రి ఆశయాలు నెరవెర్చే విషయంలో అన్ని విధాలా జగన్ మోహన్ రెడ్డి విజయవంతమయ్యారని పేర్కొంటున్నారు. తండ్రి పాలనకు కొనసాగింపుగా మొదలైన జగనన్న పాలన సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తోందంటున్నారు. రాజకీయాల్లో ఐఎస్‌ఐ మార్క్ లాంటి వైయస్ బ్రాండ్‌ను కొంతమంది స్వలాభం కోసం వాడుకోవడం నిజంగా దురదృష్టకరమని చెబుతున్నారు.
వైయస్ పేరు పబ్లిక్ ప్రాపర్టీ కాదు..
వైయస్ ఇంటి పేరును దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన సోదరులు మాత్రమే పెట్టుకుంటారని గుర్తుచేస్తున్నారు. వాస్తవంగా ఎవరైనా తండ్రి ఇంటి పేరును కొడుకులు మాత్రమే వాడుకుంటారని తెలియజేస్తున్నారు. అంతేతప్ప ఎవరు పడితే ఎవరు వాడుకోవడం కుదరదు అంటున్నారు. వైయస్ బ్రాండ్ వాడుకోవాలంటే ఓ అర్హత ఉండాలి.. గుండెల్లో దమ్ము ఉండాలి.. మాట మీద నియంత్రణ ఉండాలి.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే తప్ప పేరు వాడుకోవడానికి పబ్లిక్ ప్రాపర్టీ కాదంటున్నారు. వైయస్ బ్రాండ్ వాడుకుని లబ్ది పొందాలి అనుకునే వారికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments