‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్‌తో యూత్ బీ కేర్ ఫుల్..

  • IndiaGlitz, [Monday,March 02 2020]

‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ‘ట్రిప్పింగ్ జంప్’ పట్ల ప్రజలు ముఖ్యంగా యువత ఆకర్షితులవ్వడం ఆందోళన కలిగిస్తోందని.. విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో ‘ఛాలెంజ్’లు ఎక్కువైపోయాయి. అందులో కొన్ని మంచివి ఉంటున్నా, చెడు చేసే చాలెంజ్లూ వస్తున్నయ్. రన్నింగ్ కార్ నుంచి దిగి.. స్లోగా కదులుతున్న ఆ కార్ పక్కన డ్యాన్స్ చేసి మళ్లీ కారెక్కే ‘రన్నింగ్ మ్యాన్’ ఛాలెంజ్. దాని వల్ల చాలా మంది యాక్సిడెంట్ల బారిన పడ్డరు. ఒకరి నోట్లోని సిరీల్స్ను తీసుకుని తినే ‘సిరీల్’ చాలెంజ్ వచ్చింది. బర్డ్ బాక్స్ చాలెంజ్ అని ఉండేది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ పనులు చేయడమే ఈ ఆట ప్రత్యేకత.

అప్రమత్తంగా ఉండండి!
ఒకమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని కారు నడిపి గోడను గుద్దేసింది. ఇది అమెరికాలోని ఉటా రాష్ట్రంలో జరిగింది. అమ్మాయి తలకి గాయాలయ్యాయి. కారు తుక్కు తుక్కు అయిపోయింది. 2016 ప్రాంతంలో బ్లూ వేల్ ఆట ఇంటర్ నెట్ ను కుదిపేసింది. ఇందులో చేతిమీద తిమింగలం బొమ్మ గీయించుకుని ఆడటం జరిగేది. చివరికి ఆటగాడి మృతితో ఆట ముగిసేది. దేశంలో చాలా మంది పిల్లలు, యువకులు ఈ ఆట ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కికి చాలెంజ్ కూడా ఇలాంటిదే. తాజాగా ఎముకలు విరగ్గొట్టుకునే చాలెంజ్ నెట్ లో వైరల్ అవుతోంది. మెక్సికో సహా దక్షిణ అమెరికా, యూరప్ దేశాల్లో స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన దేశంలో సోషల్ మీడియాలో స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ట్రిప్పింగ్ జంప్ ఛాలెంజింగ్ స్టంట్ వైరల్ అవుతోంది. యువత ఈ ఛాలెంజ్ భారిన పడే అవకాశముందని తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

ఏమిటీ స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్!
ఈ ఛాలెంజ్ / ఫ్రాంక్‌లో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. మధ్యలో వ్యక్తి గాల్లో ఎగిరినప్పుడు చెరోవైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గాల్లో ఎగిరిన వ్యక్తి కాళ్లని కొడతారు. గాల్లో ఎగిరిన ఆ వ్యక్తి వారి నుంచి తప్పించుకోవాలి లేకోపోతే నేలమీద గట్టిగా పడతాడు. అలా నేల మీద పడినప్పుడు తల పగిలే అవకాశముంది లేదా చేతులు విరిగే అవకాశ ముంటుంది. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నరు. ఎక్కువగా స్కూలు పిల్లలు దీన్ని చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ వీడియోలు దర్శనమివ్వడం పట్ల తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకింత క్రేజ్ ?
ఈ స్కల్ బ్రేకర్ గేమ్ ఛాలెంజ్ కాస్త కొన్ని యాప్ లలో కి చేరడంతో ఇది మరింత పాపులర్ అయిపోయింది. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఈ గేమ్ లో పాల్గొన్న వారిలో చాలా మంది పుర్రెకు సంబంధించిన గాయాలతో పాటు నడుముకు సంబంధించిన గాయాలపాలయ్యారు.

ఎముకలు విరిగే ప్రమాదం..
స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ / ట్రిప్పింగ్ జంప్ లో భాగంగా స్టంట్లు చేయడం వల్ల తల, చేతి ఎముకలు విరిగే ప్రమాదముందని వైద్యలు హెచ్చరిస్తున్నారు. ఛాలెంజ్ తీసుకుని వెనక్కు పడితే ఒంట్లోని కీళ్లన్నీ విరిగిపోతాయి. తుంటి ఎముకలతో పాటు మోకాళ్లు, మోచేతులు, ఇతర కీళ్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇంకో ఎముకతో ఎముకను కలిపే లిగమెంట్లు తెగిపోయే ప్రమాదముంటుంది. నేలపై పడిన వ్యక్తికి నడుము, మోకాలి చీలమండకు సంబంధించిన గాయాలు కూడా అయ్యే ప్రమాదాలు ఎక్కువ. కొన్ని సార్లు తలకు బలమైన గాయమై చనిపోవచ్చు లేదా జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. ఇటీవల స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ లో వెనిజులా కుర్రాడు తలకు తీవ్రమైన గాయమయ్యింది.ఈ ఆటకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

సూచనలు..
- ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ స్కల్ బ్రేకర్ నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని యాప్ లలో వీడియోలు ఎక్కువగా చేసేవారు, ముఖ్యంగా చిన్నారులు, యువత ఈ ఛాలెంజ్ లో పాల్గొనవద్దు.
- పిల్లల పట్ల జాగ్రత్త... ఈ స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ యొక్క వీడియోలు అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి పిల్లలు ఇలాంటి స్టంట్లను ప్రయత్నించకుండా అవగాహన కల్పించాలి.
- ఈ ఛాలెంజ్ పట్ల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
- ఈ తరహా చాలెంజ్ లకు సంబంధించిన వీడియోలు తీసినా, ప్రచారం చేసినా చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. ఈ విషయమై ఏదేని సాయం కోసం 100 కాల్ చేయండి లేదా సైబరాబాద్ వాట్సాప్ 94906 17444 నంబర్ కు వాట్సాప్ చేయండి’ అని సజ్జానార్ ఓ ప్రకటనలో తెలిపారు.

More News

అడ్డంగా బుక్కయిన విరాట్ కోహ్లీ!

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు, మైదానంలో

గ్రామ వలంటీర్లపై లోకేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు

లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్‌ అందజేసి ‘గ్రామ వలంటీర్లు’ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

‘వకీల్‌ సాబ్’కు పోటీగా ‘డైరెక్టర్ సాబ్’ వచ్చేశాడు!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి ‘వ‌కీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,

భారత్‌లో కరోనా.. హైదరాబాద్‌కూ వచ్చేసింది!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

కాల్ రాగానే హీరోయిన్ ముంబై ఎందుకెళ్లింది.. అసలు కథ ఇదీ!?

‘రాహు’ మూవీ హీరోయిన్ కృతి గార్గ్‌‌కు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి ట్రాప్ చేశాడని వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.