యూత్‌ను ఆకర్షిస్తున్న కుమారి
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, 100%లవ్ తరహా క్యూట్ లవ్ స్టోరీస్ వచ్చాయి. ఒక అడుగు ముందుకేసి సుకుమార్ చేసిన బోల్డ్ అటెంప్ట్ కుమారి 21ఎఫ్.ప్రేమకు కావాల్సింది నమ్మకం. మెచ్యూరిటీ అనే కాన్సెప్ట్‌తో సుకుమార్ ఇన్‌డైరెక్ట్‌గా ఇప్పటి యూత్‌ను టార్గెట్ చేసుకుని మెసేజ్ కూడా ఇచ్చాడు. సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. యూత్ ప్రేక్షకులు మాత్రం సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
యూత్ ప్రేక్షకుల ఆదరణతో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను రాబడుతుంది. వీకెండ్ ముగిసే సరికి అంటే మొదటి మూడు రోజులకు దాదాపు పదిన్నర కోట్ల రూపాయల గకలెక్షన్స్ను సాధించింది. ఆరున్నరకోట్ల రూపాయల షేర్‌ను సాధించింది. సినిమా విశ్లేషకుల అంచనాలకు అందకుండా సినిమా దూసుకుపోతుండటం గమనార్హం. పదికోట్లకు పైగానే షేర్ సాధించే చిన్న చిత్రంగా కుమారి 21 ఎఫ్ సాగిపోతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout