'యువర్స్ లవింగ్లీ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,September 20 2017]

పొట్లూరి స్టూడియోస్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి "జో" దర్శకత్వంలో.. పృధ్వి పొట్లూరి-సౌమ్య శెట్టి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మెసేజ్ ఓరియంటెడ్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ "యువర్స్ లవింగ్లీ".అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈసందర్భంగా ఈచిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. "జై లవకుశ" సినిమా ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్స్ లో ఈ ట్రైలర్ ప్రదర్శితం కానుంది. పిల్లలతో పాటు పెద్దలంతా చూడాల్సిన సినిమాగా రూపొందిన "యువర్స్ లవింగ్లీ" చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. మోషన్ పోస్టర్ మరియు టీజర్ కు లభించినట్లుగానే..

"జై లవకుశ" చిత్రంతో విడుదల చేస్తున్న "యువర్స్ లవింగ్లీ" ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్సపెక్ట్ చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది.

బుల్ బుల్, అనిల్, గోవింద్, ప్రియ, మేఘన, సంధ్య, సుజాత, తులసి, బృంద, ఎఫ్ ఎం బాబాయ్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!!!