'యువర్స్ లవింగ్లీ' ఫస్ట్ లుక్ రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,June 27 2017]

యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ". నిర్మాతగా, కథానాయకుడిగా పృద్వీ పొట్లూరికిది తొలి చిత్రం. పృద్వీ పొట్లూరి సరసన సౌమ్య శెట్టి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాండ్ర పాపారాయ విద్యాసంస్థల అధినేత తుమ్మల భాస్కరరావు-బొబ్బిలి పురపాలక సంఘం చైర్ పర్సన్ శ్రీమతి తుమ్మల అచ్యుతవల్లి దంపతులు విడుదల చేశారు

ఈ సందర్భంగా వారు "యువర్స్ లవింగ్లీ" చిత్రం పెద్ద విజయం సాధించాలని, దర్శకుడిగా జో కి మంచి పేరు రావాలని కోరుకున్నారు. తుమ్మల దంపతులు చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం పట్ల జో సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తూ.. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న పృద్వీ పొట్లూరికి ఉజ్వల భవిష్యత్తు ఉందని జో అన్నారు. విడుదలయ్యాక "యువర్స్ లవింగ్లీ" చిత్రం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని.. పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని వెంటబెట్టుకొని ఈ సినిమాకు వెళ్తారని జో అన్నారు.

బులుబుల్, అనిల్, గోవింద్, సాయి పవన్, వెంకటేష్, సాయి తేజ, ప్రియ, మేఘన, బృంద, ఎఫ్,ఎం.బాబాయ్, తులసి, దేశీరాజు, సుజాత, సంధ్య, సత్య ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: పోతుల రవికిరణ్, కూర్పు: వి.ఎస్.నాగిరెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఛాయాగ్రహణం: ప్రవీణ్ కండ్రేగుల, నిర్మాత: పృద్వీ పొట్లూరి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జో !!

More News

జూలై నెలాఖరున 'కథలో రాజకుమారి'

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి".

జూలై 7న డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్ టైన్ మెంట్ 'రాక్షసి'

పూర్ణ ప్రధాన పాత్రలో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వంలో 'కాలింగ్ బెల్' చిత్రానికి సీక్వెల్గా అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్టైనర్ 'రాక్షసి'. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

'ఏజంట్ భైరవ' జూలై 7న విడుదల

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్ భైరవ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కాస్తా ఆందోళనలో ఉన్నారట. అందుకు కారణం ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం `జై లవకుశ` ఎంత మాత్రం కాదు. అసలు విషయమేమంటే

మహేష్ 'స్పైడర్' రిలీజ్ డేట్...

సూపర్స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన స్పై థ్రిల్లర్ `స్పైడర్`. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ సాంకేతిక కారణాలు వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.