'యువర్స్ లవింగ్లీ' ఫస్ట్ లుక్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ". నిర్మాతగా, కథానాయకుడిగా పృద్వీ పొట్లూరికిది తొలి చిత్రం. పృద్వీ పొట్లూరి సరసన సౌమ్య శెట్టి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాండ్ర పాపారాయ విద్యాసంస్థల అధినేత తుమ్మల భాస్కరరావు-బొబ్బిలి పురపాలక సంఘం చైర్ పర్సన్ శ్రీమతి తుమ్మల అచ్యుతవల్లి దంపతులు విడుదల చేశారు
ఈ సందర్భంగా వారు "యువర్స్ లవింగ్లీ" చిత్రం పెద్ద విజయం సాధించాలని, దర్శకుడిగా జో కి మంచి పేరు రావాలని కోరుకున్నారు. తుమ్మల దంపతులు చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం పట్ల జో సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తూ.. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న పృద్వీ పొట్లూరికి ఉజ్వల భవిష్యత్తు ఉందని జో అన్నారు. విడుదలయ్యాక "యువర్స్ లవింగ్లీ" చిత్రం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని.. పేరెంట్స్ అందరూ తమ పిల్లల్ని వెంటబెట్టుకొని ఈ సినిమాకు వెళ్తారని జో అన్నారు.
బులుబుల్, అనిల్, గోవింద్, సాయి పవన్, వెంకటేష్, సాయి తేజ, ప్రియ, మేఘన, బృంద, ఎఫ్,ఎం.బాబాయ్, తులసి, దేశీరాజు, సుజాత, సంధ్య, సత్య ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: పోతుల రవికిరణ్, కూర్పు: వి.ఎస్.నాగిరెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఛాయాగ్రహణం: ప్రవీణ్ కండ్రేగుల, నిర్మాత: పృద్వీ పొట్లూరి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జో !!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments