అన్నపై కౌంటర్... తమ్ముడు రీకౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్గా రాజకీయాలు, ఓటర్లు గురించి మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లు చీఫ్ లిక్కర్, డబ్బులు కోసం ఓట్లు వేస్తుంటే రాజకీయాల్లో మార్పులు రావని, నియంతృత్వం వల్లనే మార్పులు వస్తుందని విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటుడు గుల్షన్ మాట్లాడుతూ ‘తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకో మంచి హెయిర్ కట్‌ను సూచిస్తాను’ అన్నారు. దీనిపై విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కౌంటర్ ఇచ్చాడు. ‘ఓ వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు వారేం మాట్లాడారో అర్థం చేసుకోవాలి’ అంటూ రీ ట్వీట్ చేశారు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేరవకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ త్వరలోనే ఈ సినిమా రీస్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ ఓకే చెప్పేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com