పచ్చ ముఠా వేధింపులకు బలైన యువతి.. ఆత్మహత్యలకు పురిగొలుపుతున్న పెత్తందార్లు..?

  • IndiaGlitz, [Monday,March 11 2024]

సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో పేదలకు మంచి జరిగినా... తమకు ప్రయోజనం కలిగిందని చెప్పినా.. అటు పెత్తందారులు... ఎల్లోమీడియా, సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. టీడీపీ, జనసేన రాజకీయ వేధింపులకు మరో మహిళ బలైంది. ఇప్పటికే వీరి అరాచకాలకు ఎంతో మంది తీవ్రవేదనకు గురయ్యారు. ముఖ్యంగా పేదవాళ్లపై దారుణంగా ట్రోల్స్ చేసి.. వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తాజాగా ఈ రాక్షస మూక వేధింపులకు గీతాంజలి అనే పేదింటి మహిళ బలవన్మరణానికి పాల్పడింది.

చంద్రబాబు హయాంలో అయన అనుచరులు.. సొంత సామాజికవర్గం వాళ్ళు తప్ప ఎక్కడా సామాన్యుడికి, పేదలకు సాయం అందిన దాఖలాలు లేవు. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక కులం, మతం, ప్రాంతం, ఏ పార్టీ వారు అన్నది కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా రాగద్వేషాలకు అతీతంగా అందరికీ మంచి చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం పట్ల కొందరు లబ్ధిదారులు తమ వంతు కృతజ్ఞత ప్రకటిస్తున్నారు. మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

అంతే దాన్ని సైతం సహించలేని ఐటీడీపీ , ఎల్లోమీడియా అలాంటి అభిప్రాయాలూ వ్యక్తం చేసిన లబ్ధిదారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాయలేని విధంగా దూషించడం. బూతులు తిట్టడం పనిగా పెట్టుకున్నారు . వారి కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను సైతం దూషిస్తూ పోస్టులు పెట్టి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన గీతాంజలి(28)అనే ఓ మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు జగనన్న పాలనలో సొంత ఇల్లు మంజూరైందనే ఆనందాన్ని మీడియాతో వ్యక్తం చేసింది. అలాగే తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి తెలిపింది.

ఇక అంతే పచ్చ మీడియాతో పాటు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా వాళ్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె శరీరాన్ని, మాటల్ని, వ్యక్తిత్వాన్ని నీచంగా కించపరిచారు. తీవ్ర పదజాలంతో బూతులు తిట్టడంతో పాటు అర్థరాత్రుళ్లు ఫోన్లు చేసి వేధించారు. వారి వేధింపులు భరించలేక రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది.

ఆమె మరణానికి ఇప్పుడు ఎవరు బాధ్యులు... ఆమెకు ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా ఇల్లు మంజూరు చేయడమే తప్పా... ఇల్లు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేయడం నేరమా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

గతంలో బెండపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడితే.. పసిపిల్లలు అని చూడకుండా వారిపైన ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కూడా మహిళలపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని చెప్పిన యువతిని వికృతమైన మాటల దాడితో ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. ఇప్పడు ఆ పిల్లలు అనాథలయ్యారు. వారికి దిక్కువరూ. ఇలాంటి నరరూప రాక్షసులు.. సైకోలను దారుణంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

More News

హీరోయిన్ పెళ్లి చేసుకుని మోసం చేసింది.. భర్త సంచలన ఆరోపణలు..

ఆమె తెలుగు సీరియల్స్‌లో నటిస్తోంది. మ్యాట్రిమోనీ సైట్‌లో ఓ యువకుడిని చూసి ఇష్టపడింది. తర్వాత అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకున్నారు.

CAA: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. సీఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్..

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం.. ఎప్పుడంటే..?

ఈ మధ్య తెలుగు హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. తాజాగతా మరో యంగ్ హీరో ఓ ఇంటివాడు అయ్యేందుకు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ టాక్.

Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. టీడీపీ అభ్యర్థికి లైన్ క్లియర్..

జనసేన పార్టీ మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

Surya Kiran: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటి కల్యాణి భర్త, దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. కొంత కాలంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న