యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా

  • IndiaGlitz, [Monday,May 10 2021]

కరోనా ఫస్ట్ వేవ్‌లో పెద్దగా సెలబ్రిటీలెవరూ కరోనా బారిన పడలేదు కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం స్టార్ హీరోలంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకోగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మహమ్మారి బారిన పడటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తారక్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం తన కుటుంబంతో సహా ఐసోలేషన్‌లో ఉన్నానని వెల్లడించాడు. భయపడాల్సిన పని లేదన్నాడు.

Also Read: కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాం. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ అన్నీ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండండి..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్వీట్ చూసిన వారంతా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.