'యంగ్ స్టార్స్' ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదిత్య ఓం ,స్వాతి టండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న త్రిభాషా చిత్రం "యంగ్ స్టార్స్". రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై రాధ వైష్ణవ్ లక్ష్మి నారాయణ, ఔరంగజేబ్, వినొద్ పార్వతి, మురళికృష్ణ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లొ యంగ్ స్టార్స్ చిత్రీకరణ ప్రారంభమైంది.
దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో స్నేహం, ప్రేమ అనే రెండు రిలేషన్స్ యువతరం జీవితాలను ఏ విధంగా ప్రభావితం చెస్తున్నాయి,ఏ తరహా అలజడులను సృష్టిస్తున్నాయన్న కాన్సెప్ట్ తో యంగ్ స్టార్స్ చిత్రం తెరకెక్కనుంది.
ఆదిత్య ఓం పాత్ర విభిన్నంగా ఉంటుంది. సినీయర్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చెస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు ,ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ మూడు షెడ్యూల్స్ లొ చేసి , దసరాకు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో చిత్రాన్ని విడుదల చెస్తామన్నారు.
కెమెరామెన్ & ప్రొడ్యూసర్ Yv లక్ష్మీ నారాయణ రాయల్ మాట్లాడుతూ అందరి అభిమానం మీడియా సహకారం కావాలని కోరుకుంటూ మరో జంట నీ మరి కొందరు ఆర్టిస్టులు కూడా త్వరలో తెలుపుతాము అని తెలిపారు
ఖయ్యుమ్, చిత్రం భాషా, పృధ్వీ, రంజిత్, జబరదస్త్ ఆర్టిస్ట్లు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: వై.వి.లక్ష్మి నారాయణ, సంగీతం: డేవిడ్.జి, ఆర్ట్: వినోద్, పైట్స్: పి.సతీష్ మాస్టర్,కొరియోగ్రాఫర్ : కపిల్ మాస్టర్, కూర్పు: నందమూరి హరి, విఎఫ్ఎక్స్: హలొ 1 స్డూడియో, ఎస్ఎఫ్ఎక్స్: మీనాక్షి ప్రొడక్షన్స్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com