ఆర్ఆర్ఆర్ రిలీజ్ : తండ్రి మందలించాడని .. ఉరేసుకుని అభిమాని ఆత్మహత్య

  • IndiaGlitz, [Saturday,March 26 2022]

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ‘‘ఆర్ఆర్ఆర్’’ మ్యానియానే నడుస్తోంది. ఏ ఒక్కరిని కదిలించినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా సినిమాను తొలిరోజే చూసి.. హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ సందర్భంగా పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. మెగా నందమూరి అభిమానుల మధ్య గొడవలు జరగ్గా.. అనంతలో ఇద్దరు అభిమానులు మృతిచెందడం విషాదం నింపింది.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శంకర్ అనే యువకుడు కాలేజీకి వెళ్లకుండా ఆర్ఆర్ఆర్ సినిమాకు వెళ్లాడు. సినిమా చూసి ఇంటికి వచ్చిన యువకుడిని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన శంకర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

అనంతపురం జిల్లాలోనే జరిగిన మరో ఘటనలో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ అభిమాని మృతి చెందాడు. శుక్రవారం ఎస్ వీ మ్యాక్స్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోలు వేయడంతో ఓబులేసు (30) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్రీమియర్ షోకి వెళ్లాడు. సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తోటి అభిమానులు అతనిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఓబులేసు కుటుంబసభ్యులు, సన్నిహితులు విషాదంలో కూరుకుపోయారు.

More News

బొమ్మ అదుర్స్.. ఆర్ఆర్ఆర్‌ని ఈ వారమే ఫ్యామిలీతో కలిసి చూస్తా: నారా లోకేష్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.

అదో కళాఖండం .. మైండ్ బ్లోయింగ్, ఆర్ఆర్ఆర్‌పై చిరు రివ్యూ

దర్శక ధీరుడు  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’

మున్సిపల్ సిబ్బంది నిర్వాకం.. పన్ను చెల్లించలేదని, ఇంటి ముందు చెత్త కుప్ప

ఇంటిపన్ను, నీటి పన్ను వంటి వాటిని వెంటనే చెల్లించాలంటూ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు మైకుల ద్వారా అనౌన్స్‌ చేస్తుంటాయి. అంతేకాదు..

హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్... ఇరానీ ఛాయ్ ధరల పెంపు, కప్పు ఎంతో తెలుసా..?

ఇరానీ చాయ్... హైదరాబాద్‌కు ఎవరొచ్చినా బిర్యానీ తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చేసేది దీనినే.

ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో విషాదం.. సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’.