గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం!
Send us your feedback to audioarticles@vaarta.com
తాను సినీ నటిని అని చెప్పుకుంటున్న యువత సునీత బోయ మరోసారి గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట హల్ చల్ చేసింది. గత మూడేళ్ళ నుంచి ఆమె ఈ వివాదాన్ని కొనసాగిస్తోంది. గీతా ఆర్ట్స్ కు చెందిన నిర్మాత బన్నీ వాసుపై ఆమె వరుసగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేసినట్లు సునీత ఆరోపణలు చేస్తోంది. గతంలో పలు మార్లు ఆమె గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట న్యూసెన్స్ చేసిందని కేసులు కూడా నమోదయ్యాయి. అయినా కూడా సునీత బన్నీ వాసుని నీడలా వెంటాడుతోంది.
ఇటీవల సునీత మలక్ పేటలో పుచ్చకాయలు విక్రయిస్తూ కనిపించింది. ఇప్పటికే ఆమెపై నాలుగు ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి. అలాగే ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ మరోమారు సునీత గీతా ఆర్ట్స్ ఎదుట హంగామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆమె ఆత్మహత్య యత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. గీతా ఆర్ట్స్ మేనేజర్ అయ్యప్ప ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని బన్నీ వాసు తనని మోసం చేసినట్లు సునీత బలంగా వాదిస్తోంది. అయితే పోలీసులు ఆమెని కోర్టు ఎదుట హాజరు పరచగా.. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది.
బన్నీ వాసు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో నిర్మాతగా రాణిస్తున్నారు. సునీత అనవసరంగా ఆరోపణలు చేస్తూ న్యూసెన్స్ చేస్తోంది అనేది గీతా ఆర్ట్స్ నుంచి వినిపిస్తున్న వాదన.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com