శింబుతో ప్రేమ‌లో ఉన్న కుర్ర హీరోయిన్‌...

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

హీరోయిన్స్‌ను ప్రేమ‌లో దించ‌డం.. వారితో చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం.. త‌ర్వాత బ్రేక‌ప్ చెప్పేయ‌డం శింబుకి కొత్తేమీ కాదు.. ఈ హీరో న‌య‌న‌తార‌, హ‌న్సిక వంటి హీరోయిన్స్‌తో బాహాటంగానే ప్రేమాయణం న‌డిపి, త‌ర్వాత బ్రేక‌ప్ కూడా చెప్పేశాడు. చాలా రోజులుగా ఏ హీరోయిన్ వెంట ప‌డ‌ని శింబు ఇప్పుడు కుర్ర హీరోయిన్ ఓవియాతో ప్రేమ‌లో ఉన్నాడు. ఈ విష‌యాన్ని ఆమె తెలియ‌జేయ‌డం కొస‌మెరుపు.

బిగ్‌బాస్ 1తో ఫేమ‌స్ అయిన ఓవియాకు ఆ స‌మ‌యంలోనే శింబు మ‌ద్ధ‌తు తెలిపారు. అయితే వీరి మ‌ధ్య బంధం గురించి అడిగితే.. 'ప్రేమ ఎక్క‌డైనా, ఎప్పుడైనా పుట్టొచ్చు. శింబు నాకు మంచి స్నేహితుడు. నా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా ఆయ‌న‌తో షేర్ చేసుకుంటాను. మా స్నేహం ఇలాగే ఉండాలి. శింబు నన్ను ఎంతో ప్రోత్స‌హించ‌డ‌మే కాదు.. నాలో పాజిటివిటీని కూడా నింపుతుంటారు. శింబు తోడు జీవితాంతం కావాలి' అంటూ ఓవియా ప‌రోక్షంగా తాము ప్రేమ‌లో ఉన్నామ‌నే విష‌యాన్ని చెప్పిందే కానీ.. డైరెక్ట్ ల‌వ్ మేట‌ర్‌ని ప్ర‌స్తావించ‌లేదు.