ప్రొడక్షన్ చేయాలనుందంటున్న యంగ్ హీరో...
- IndiaGlitz, [Tuesday,March 22 2016]
ప్రస్థానం ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ వరుస అవకాశాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పుడు మలయాళం, తమిళ్ రీమేక్ నేరం రీమేక్ రన్ లోనటించాడు. మార్చి 23న హోలీ సందర్భంగా సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ హీరో షార్ట్ ఫిలింస్ ను లక్ష రూపాయలుంటే చేసెయ్యవచ్చు. కానీ సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే నాలుగైదు కోట్లు కావాలి. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బులు లేవు. అయితే భవిష్యత్ లో ప్రొడక్షన్ చేయాలనే కోరికతే మనసులో ఉందని చెప్పుకొచ్చాడు.