టిఫిన్ సెంటర్ ఓనర్‌గా మారిన యువ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు ఆనంద్ దేవరకొండ. తొలి చిత్రం ‘దొరసాని’లో శివాత్మిక రాజశేఖర్‌తో కలిసి చక్కగా నటించాడు. నటుడిగా మంచి మార్కులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో రెండో సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధమైంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వినోద్ ఆనంతోజు తెరకెక్కించాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్.
ఈ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆనంద్ దేవరకొండ తెలియజేశాడు. ఈ సినిమా కోసం ఆనంద్ దేవరకొండ వంటవాడిగా మారాడట. ముఖ్యంగా కథానుగుణంగా గుంటూరులో టిఫన్ సెంటర్ ఓనర్‌గా కనిపిస్తాడు. అందుకోసం దోశలు ఎలా చేయడం, చట్నీ చేయడం ఎలాగో నేర్చుకున్నాడట. కథ విన్నప్పుడు తాను కూడా మిడిల్ క్లాస్ అబ్బాయి కావడంతో కథకు బాగా కనెక్ట్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే సినిమా కోసం గుంటూరు యాసను నేర్చుకున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments