ఏడాదికో చిత్రం చేస్తున్న యంగ్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు రాజ్ తరుణ్‌కు కలిసొచ్చిన కథానాయికల్లో హెబ్బా పటేల్ ఒకరు. కుమారి 21 ఎఫ్(2015)తో మొదలైన వీరి కాంబినేషన్ ఈడో రకం ఆడో రకం (2016), అంధగాడు (2017) వరకు కొనసాగింది. అతి త్వరలో ఈ ఇద్దరూ మరో సినిమాలో కలిసి నటించబోతున్నరంటూ కథనాలు వినిపిస్తున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఘనవిజయం సాధించిన నానుమ్ రౌడీదాన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
విజయ్ సేతుపతి పాత్రలో రాజ్ తరుణ్ నటించనున్న ఈ సినిమాలో నయనతార పోషించిన చెవిటి అమ్మాయి పాత్రలో హెబ్బా పటేల్ నటించే అవకాశముందని తెలిసింది. అదే గనుక నిజమైతే.. హెబ్బాతో రాజ్ తరుణ్ ఏడాదికో సినిమా చేయడం వార్తల్లో నిలిచే విషయం అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments