ఆరు నెలల్లో అరవై కథలు విన్న యువ హీరో

  • IndiaGlitz, [Saturday,April 30 2016]

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలి, సాహస బాలుడు విచిత్ర కోతి.. చిత్రాల్లో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకొని వినవయ్య రామయ్య చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో నాగ్ అన్వేష్. ప్రస్తుతం నాగ్ అన్వేష్ తన రెండో చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. తన మొదటి చిత్రం వినవయ్యా రామయ్యా తోనే మంచి నటుడు అనిపించుకునే ప్రయత్నం చేసిన నాగ అన్వేష్ ద్వితీయ చిత్రంతో మంచి విజ‌యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నాడు.

రెండో సినిమా కోసం దాదాపు 50 నుంచి 60 కథలు విన్నాడ‌ట‌. అయితే చివరకు ఓ స్టోరీ ఓకే చేసి దాని పై ఆరు నెలలుగా వర్క్ చేస్తున్నారని సమాచారం. పక్కా ప్లానింగ్ తో ప్రీ పొడక్షన్ వర్క్ అయ్యాకే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు నాగ అన్వేష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ ఎవ‌రు..? హీరోయిన్ ఎవరు..? తదితర విషయాలు త్వరలో ప్ర‌క‌టించ‌నున్నారు.

More News

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌నంటున్న క‌మ‌ల్..

క‌మ‌ల్ హాస‌న్ తాజా చిత్రం శ‌భాష్ నాయుడు. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు టి.కె. రాజీవ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ కుమార్తె గా శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం. చెన్నైలో ఈ చిత్రం ప్రారంభ‌మైంది.

6 రోజులు..3 ఆడియోలు..1 మ్యూజిక్ డైరెక్ట‌ర్..

6 రోజులు..3 ఆడియోలు..1 మ్యూజిక్ డైరెక్ట‌ర్...ఆ ఒక్క మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు...మిక్కీ జే మేయ‌ర్. నితిన్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించారు.

అమల సభ్యురాలిగా జంతు సంరక్షణ మండలి..

నాగార్జున సహకారంతో అమల బ్లూక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలుగా జంతువులను సంరక్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విషయం తెలిసిందే.

చైతు మూవీకి నాగ్ వాయిస్ ఓవ‌ర్..

నాగ చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

అ ఆ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిథి ప‌వ‌ర్ స్టార్..

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత న‌టించింది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మించారు.