బాలయ్య సినిమాలో కుర్ర హీరో కీలక పాత్ర..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 106 చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం షూటింగ్‌ను ఆపేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం సినిమాను పలు లోకేషన్స్‌లో చిత్రీకరించాల్సి ఉంది. ఉదాహరణకు ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తాడని టాక్ ఉంది. అందులో ఒకటి అఘోరా పాత్రట. కాగా.. ఈ సినిమాలో బాలకృష్ణ అసిస్టెంట్ పాత్రలో ఓ కుర్ర హీరో నటిస్తున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి. అలాగే ఇందులో కొత్త హీరోయిన్ నటిస్తుంది.
సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com