వెంకటేష్ తో యువ కథానాయకుడు..

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

ఈ ఏడాది ఆరంభంలో గురు చిత్రంతో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌. త‌దుప‌రి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్న ఆయ‌న ఎట్ట‌కేల‌కు ఓ మూవీకి ఓకే చెప్పారు. వెంక‌టేష్ సోద‌రుడి త‌న‌యుడు రానాతో నేనే రాజు నేనే మంత్రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన తేజ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ సినిమాలో వెంకీతో పాటు మ‌రో హీరోకి కూడా స్థాన‌ముందంట‌. ఆ క్యారెక్ట‌ర్‌కి నారా రోహిత్‌, సుమంత్ వంటి యువ క‌థానాయ‌కుల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. న‌వంబ‌ర్ రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ని, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌.

ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించే ఈ సినిమాలో మెహ‌రీన్ ఓ క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని, మ‌రో హీరోయిన్‌గా అనుష్క న‌టించే ఛాన్స్ ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తేజ గ‌త చిత్రం నేనే రాజు నేనే మంత్రికి సంగీత‌మందించిన అనూప్ రూబెన్స్‌నే ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీకి కూడా స్వ‌రాలు అందించ‌నున్నార‌ట‌.

More News

వారం గ్యాప్ లో మహేష్, బన్నీ?

ఈ సంవత్సరం ఒకే ఒక సినిమాతో సందడి చేసారు సూపర్స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. స్పైడర్ చిత్రంతో సెప్టెంబర్లో మహేష్ అభిమానుల ముందుకొస్తే..

దలైలామా ను కలవొద్దు... చైనా ఘాటు హెచ్చరిక

గతం లో విదేశీ నాయకులు ఎవరైనా బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ను కలిస్తే చైనా నిరసన తెలుపుతూ వచ్చేది. కానీ ఇప్పుడు దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు తెలుస్తోంది.

త్రివిక్ర‌మ్ డబుల్ ధ‌మాకా?

ఏడాదికో సినిమా.. లేదంటే రెండు మూడేళ్ల‌కో సినిమా.. ఇలా ఉంటుంది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చే సినిమాల ప‌రిస్థితి. అలాంటి త్రివిక్ర‌మ్ వ‌చ్చే ఏడాది త‌న అభిమాల‌కు, ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజింగ్ షాక్ ఇవ్వ‌నున్నారా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం త్రి

'రంగ‌స్థ‌లం' కొత్త డేట్‌..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'రంగ‌స్థ‌లం'. అక్కినేని స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక గీతంలో ఆడిపాడ‌నుంది.

నవంబర్‌ 17న 'ఖాకి' భారీ రిలీజ్

"మనం చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను కాపాడే పోలీస్‌ ఉద్యోగం చేయడం లేదు. మంచి వాళ్లనుంచి చెడ్డవాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం.. సార్‌" అని ఓ పోలీసాఫీసర్‌ తన పైఅధికారిని అడుగుతున్న ప్రశ్న ఇది. ‘‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికిచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణాలకు ఎందుకివ్వరు సార్‌’ ఇది అతని ఆవేదన. దీన్నిబట్టి అతనెంత సిన్సియర్‌గా డ్యూట