వెంకటేష్ తో యువ కథానాయకుడు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఆరంభంలో గురు చిత్రంతో సందడి చేశారు సీనియర్ కథానాయకుడు వెంకటేష్. తదుపరి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్న ఆయన ఎట్టకేలకు ఓ మూవీకి ఓకే చెప్పారు. వెంకటేష్ సోదరుడి తనయుడు రానాతో నేనే రాజు నేనే మంత్రి వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన తేజ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సినిమాలో వెంకీతో పాటు మరో హీరోకి కూడా స్థానముందంట. ఆ క్యారెక్టర్‌కి నారా రోహిత్, సుమంత్ వంటి యువ కథానాయకుల పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. నవంబర్ రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారమ్.
ఇద్దరు హీరోయిన్స్ నటించే ఈ సినిమాలో మెహరీన్ ఓ కథానాయికగా ఎంపికైందని, మరో హీరోయిన్‌గా అనుష్క నటించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తేజ గత చిత్రం నేనే రాజు నేనే మంత్రికి సంగీతమందించిన అనూప్ రూబెన్స్‌నే ఈ మల్టీస్టారర్ మూవీకి కూడా స్వరాలు అందించనున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com