ప్లాప్ లతో హాట్రిక్ కొట్టిన యంగ్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
యాంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం 'సవ్యసాచి' చిత్రం ఇటీవలే నవంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ హైప్ తో విడుదలైనప్పటికి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రం ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ డివైడ్ టాక్ వల్ల సోమవారానికి వసూళ్ళు చాలా వరకు డ్రాప్ అవుతూ వచ్చాయి.దింతో "సవ్యసాచి" పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేని స్థితిలో పడిపోయింది.
గతేడాది నాగ చైతన్య చేసిన 'యుద్ధం శరణం' థియేటర్లకు ఎప్పుడు వచ్చిందో పోయిందో తెలియకుండానే పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మారుతి తో శైలజ రెడ్డి అల్లుడు చిత్రం చేసిన కూడా చైతూకు హిట్ ఇవ్వలేకపోయింది.
ఇలా వరుసగా చైతు చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాపులుగానే మిగిలిపోయాయి. అయితే ఎంత ఆచి తూచి ఏరి కోరి యంగ్ టాలెంటెడ్ దర్శకులతో చైతు సినిమాలు చేస్తున్న కూడా హిట్ అందుకోలేకపోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com