పెళ్లికి రెడీ అవుతున్న యంగ్ హీరో..
- IndiaGlitz, [Saturday,February 13 2016]
పెళ్లికి రెడీ అవుతున్న యంగ్ హీరో...ఎవరో కాదు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్. గౌరవం సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు శిరీష్ ఆతర్వాత కొత్త జంట సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పరుశరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తుంది.
కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ కోసం తపిస్తున్న అల్లు శిరీష్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. పెళ్లి కూడా కుదిరిందట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. త్వరలోనే నాకు శ్రీమస్తు..శభమస్తు..మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. మిగతా వివరాలు అతి త్వరలో..ఇట్లు మీ శిరి అంటూ ట్విట్టర్ లో తెలియచేసాడు అల్లు శిరీష్. అదీ సంగతి.