యువ నటుడికి కరోనా.. కాలు తొలగింపు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఎవర్నీ వదలట్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలువురు కరోనా బారీన పడి కోలుకుంటుండగా.. ఇంకొందరు మాత్రం దీనిపై పోరాటం చేసి కన్నుమూస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్లో మాత్రం నటీనటులకు పెద్ద ఎత్తున కరోనా సోకుతోంది. వీరిలో చాలా మంది కరోనాపై పోరాడి జయించి ఇంటికెళ్తున్నారు. హాలీవుడ్లో అయితే చాలా మంది నటులు కరోనా థాటికి కన్నుమూశారు. అయితే తాజాగా మరో ప్రముఖ, యువ నటుడు నిక్ కార్డెరోకు కరోనా సోకింది. ఈ వైరస్ దెబ్బకు చివరికి తన కాలును కోల్పోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగింది!?
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో హుటాహుటిన లాస్ ఏంజిల్స్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. కరోనాతో తీవ్ర ఇన్ఫెక్షన్ రావడంతో కుడి కాలిలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి ముక్కులుగా విడిపోయింది. అయితే ఇదే ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు చెప్పడంతో.. కాలు తొలగించాలని నిక్, ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని కుటుంబీకులకు వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు అలా కాలు తొలగించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిక్ సతీమణి అమందా మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయన ఆప్తులు, మిత్రులు, అభిమానులు నిక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments