డైరెక్షన్ ఆలోచనలో యంగ్ హీరో....


Send us your feedback to audioarticles@vaarta.com


అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ సినిమాల్లో నటించిన తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీవిష్ణు. నిజానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు తదుపరి హీరోగా మారిన సంగతి తెలిసిందే.
అయితే దర్శకత్వంలో తన ప్రతిభను చూపించుకోవడానికి అవకాశం వస్తే తప్పకుండా దర్శకత్వం చేస్తానని అంటున్నాడు. ప్రస్తుతం నటుడిగానే ఉండాలనుకుంటున్నానని..మంచి కథ కుదరగానే మెగాఫోన్ చేపడతానని కూడా శ్రీవిష్ణు తెలియజేశారు.
ప్రస్తుతం శ్రీ విష్ణు వీరభోగ వసంతరాయులు అనే సినిమాతో పాటు తిప్పరా మీసం అనే సినిమా చేస్తున్నాడు. మరికొన్ని కథలు వింటున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments