టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో కుర్ర హీరో మృతి

  • IndiaGlitz, [Saturday,February 15 2020]

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషాద ఘటన మరువకే ముందే టాలీవుడ్‌ మరో ఘటన చోటుచేసుకుంది. ‘పరారే పరరె’, ‘ఫ్రెండ్స్ బుక్’తో పాటు పలు తమిళ సినిమాల్లో హీరోగా నటించిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన నందురీ ఉదయ్ కిరణ్ (34) ఇవాళ కన్నుమూశాడు. శుక్రవారం రాత్రి 10:30 గంటలకు ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఉదయ్ కన్నుమూశాడు. దీంతో కిరణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని రామారావుపేటలోని తన స్వగ్రామానికి తరలించారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది.

టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు, రాజకీయ నేతలు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఓవైపు తమిళ సినిమాల్లో.. మరోవైపు తెలుగు సినిమాల్లోనూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న ఉదయ్ కిరణ్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆప్తులు విషాదంలో మునిగిపోయారు.

More News

చిరు ‘పునాదిరాళ్లు’ డైరెక్టర్ కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే సినీ ప్రముఖులు కన్నుమూస్తుండటం గమనార్హం.

28న వస్తున్న‘స్వేచ్ఛ’

ఆడపిల్ల పుడితే చాలు అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది?

నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేసిన 'ఏమైపోయావే' మోషన్ పోస్టర్

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం  స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...నిజ‌మెంత‌?

యువ క‌థానాయ‌కుడు నితిన్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ యోచ‌న‌లో జ‌క్క‌న్న‌..?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి.. ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. బాహుబ‌లి సినిమాతో ఈయ‌న క్రియేట్ చేసిన సెన్సేష‌న్ ఆ రేంజ్‌లో ఉంది మ‌రి.