బ్యాగ్రౌండ్ లేకపోతే అంతేనా.. ప్రమాదంలో యువ హీరో కెరీర్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల బాలీవుడ్ లో ఓ యువ హీరో పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడే కార్తీక్ ఆర్యన్.. తన టాలెంట్, చార్మింగ్ లుక్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు. బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్ హీరో అనే కితాబు కూడా అభిమానులు ఇచ్చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అతడి కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు.
కార్తీక్ చుట్టూ ఏదో జరుగుతోంది అనే అనుమానం కలగక మానదు. ఇది కార్తీక్ స్వయం కృతాపరాధామా లేక అతడికి బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల ఒంటరివాడు అవుతున్నాడా ? ఈ ప్రశ్నలపై అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి.
కార్తీక్ ఆర్యన్ ని 'దోస్తానా 2' నుంచి ధర్మ ప్రొడక్షన్స్ తీసేసింది. దీనికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో దుమారం చెలరేగింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ సంస్థ కార్తీక్ ఆర్యన్, కత్రినా కైఫ్ జంటగా ఓ చిత్రాన్ని నిర్మించాలని భావించింది.
ఏమైందో ఏమో కానీ ఈ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కత్రినాతో నటించేందుకు కార్తీక్ ఒప్పుకోలేదని అందుకే అతడిని తప్పించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ డిలే వల్లే ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవుతోందనేది మరొక వెర్షన్.
ఇంతలోనే మరొక పుకారు పుట్టుకొచ్చింది. ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం నుంచి కూడా కార్తీక్ ని తప్పించారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని దర్శకుడు కొట్టిపారేశారు. బాలీవుడ్ లో ఏం జరిగినా కార్తీక్ ఆర్యన్ ని బూచిగా చూపిస్తూ బలిచేస్తున్నారనే వాదన అభిమానుల నుంచి బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ కెరీర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని తలపించేలా ఉందని, బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లే బాలీవుడ్ మాఫియా అతడిని టార్గెట్ చేస్తోందని అభిమానుల్లో వాదనలు మొదలయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments