బాలయ్యతో మళ్లీ మూవీ చేయాలనుకుంటున్న యంగ్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
కుర్ర దర్శకులు ఈ మధ్య కొత్త కొత్త కాన్సెప్టులతో సత్తా చాటుతున్నారు. మంచి విజయాలను దక్కించుకుంటున్నారు. సక్సెస్‌ఫుల్‌గా ట్రావెల్ అవుతున్న యంగ్ డైరెక్టర్స్‌లో అనీల్ రావిపూడి ఒకరు. పటాస్ నుండి రీసెంట్‌గా విడుదలైన సరిలేరునీకెవ్వరు వరకు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు లాక్‌డౌన్ వల్ల వచ్చిన క్వారంటైన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అందులో భాగంగా తను డైరెక్ట్ చేసిన సూపర్‌హిట్ మూవీ ఎఫ్2కు సీక్వెల్‌గా ఎఫ్3కి సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు అనీల్.
అయితే లేటెస్ట్‌గా నందమూరి బాలకృష్ణతో అనీల్ రావిపూడి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. నిజానికి బాలకృష్ణ 101వ చిత్రాన్ని అనీలే డైరెక్ట్ చేయాల్సింది కానీ చేయలేదు. అప్పట్లో బాలకృష్ణను కలిసి ఈ యంగ్ డైరెక్టర్ రామారావు ఐఏయస్ అనే కథను కూడా వినిపించాడు. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో బాలయ్య డ్రాప్ అయ్యారు. పూరి జగన్నాథ్ పైసా సూల్‌ను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు మళ్లీ అనీల్ బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడట. ఎఫ్ 3 తర్వాత బాలయ్యను కలిసే అవకాశం ఉందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com