రేటు పెంచేసిన యంగ్ డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
రేటు పెంచేసిన యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు...అనిల్ రవిపూడి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రవిపూడి తెరకెక్కించిన చిత్రం పటాస్. తొలి చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించిన అనిల్ రవిపూడి మలి చిత్రంగా తెరకెక్కించిన చిత్రం సుప్రీమ్. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరోగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా మంది దర్శకులు ద్వితీయ విఘ్నం దాటలేకపోయారు.
అయితే...అనిల్ మాత్రం ద్వితీయ విఘ్నం దాటేసి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. పటాస్, సుప్రీమ్...ఇలా వరుసగా రెండు చిత్రాలతో సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ అనిల్ మూడో చిత్రానికి రెమ్యూనరేష్ పెంచేసాడట. ఎనర్జిటిక్ హీరో రామ్ తో అనిల్ తదుపరి చిత్రం చేయనున్నాడు. ఇటీవల రామ్ కి అనిల్ కథ చెప్పడం..ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఈ చిత్రానికి అనిల్ రెమ్యూనరేషన్ 3 కోట్లు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com